
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు నిరీక్షణ తప్పేలాలేదు. పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తొలుత ప్రకటించినప్పటికీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు ఆలస్యంగా విడుదల చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఫలితాల వెల్లడి మరికాస్త ఆలస్యమవుతుందని మరోమారు ప్రకటించింది. దీంతో విద్యార్ధులు ఫలితాలు అసలెప్పుడు వస్తాయో తెలియక తికమకపడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం తెలంగాణ పదో తరగతి పలితాలు ఈ రోజు మధ్యాహ్నం 2.15 కి విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఈ ఫలితాలు వెల్లడి చేయేనున్న కారణంగానే ఆలస్యం నెలకొంది. సీఎం రేవంత్ కు ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉంది. ఈ రోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మద్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ చేరుకుంటారు. అనంతరం మొయినాబాద్, గుడి మల్కాపూర్ లో రెండు వివాహా వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 కి రవీంద్రభారతిలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఫలితాల వెల్లడి అనంతరం టీవీ 9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.