
భారత్-పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతో కాల్పులు జరినట్లు భారత సైన్యం చెబుతోంది. స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. రైఫిళ్లు, పిస్తోళ్లతో జరిగే కాల్పులను స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ అంటారు. అయితే పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టారు భారత జవాన్లు. ఎలాంటి ఎలాంటి దాడులకు దిగినా, తగిన బుద్ధిచెప్పేందుకు ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు రెడీగా ఉన్నట్లు ఆర్మీ చెబుతోంది.
మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. అడవులు, గుట్టలు, జనావాసాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఇలా అణువణువూ గాలిస్తున్నారు. పహల్గామ్‌లో ముష్కరమూకల, ఉగ్రవాదుల మూలాలను సేకరించే పని ముమ్మరంగా ఉన్నారు భద్రతా బలగాలు. ముగ్గురు ఉగ్రవాదులు గతంలోనూ దాడుల్లో పాల్గొన్నట్టు గుర్తించారు. కశ్మీర్‌లో స్థానికేతరులను టార్గెట్‌గా చేసుకుని.. గతేడాది కాల్పులు జరిపారు ఆదిల్ హుస్సేన్, హోషిమ్, అలీ. ఈ ముగ్గురి ఆచూకీ చెప్తే రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించారు.
2024 అక్టోబర్‌లో గగన్‌గిర్ ప్రాంతంలో ఆరుగురు కూలీలను చంపిన ఈ ఉగ్రమూక.. ఆ తర్వాత బారాముల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లపై కూడా కాల్పులు జరిపి వాళ్ల మరణానికి కారకులయ్యారు. స్థానికంగా ఉంటున్న కొందరి సహకారంతోనే ఈ ఉగ్రమూక రెచ్చిపోతోంది. ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హాషిమ్ మూసా.. ఈముగ్గురికీ పాక్ నుంచే డైరెక్ట్‌గా సహాయం అందుతోంది. ఈ ముగ్గురిలో అలీభాయ్, మూసాలు పాక్ జాతీయులే. అక్రమంగా చొరబడి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నట్టు గుర్తించారు జమ్ముకశ్మీర్ పోలీసులు.