
పహల్గామ్ దాడికి ప్రతీకారం ఎలా ఉండబోతోంది…? సర్జికల్ స్ట్రైక్‌కి మించి రివెంజ్ ఉంటుందా…? ప్రపంచం నివ్వెరపోయేలా ప్రతీకారం ఉంటుందన్న కేంద్రప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది…? ఇప్పుడివే అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. అటు ప్రజల నుంచి ఇటు సోషల్ మీడియాలోనూ ఉగ్రదాడిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం పాక్‌కు గట్టిగానే గుణపాఠం చెప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుని పాక్‌ను ఏకాకిని చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది…!
ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అటారీ చెక్‌పోస్ట్ మూసేస్తున్నట్లు తెలిపింది. పాకిస్తానీలకు ఇకపై వీసాలివ్వద్దని నిర్ణయించింది. స్పెషల్ వీసాలపై వచ్చిన వాళ్లూ వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేసింది. ఇటు హైకమిషన్ నుంచి ఐదుగురు పాక్ సపోర్టింగ్ స్టాఫ్‌ని తీసివేయడంతో పాటు సిబ్బంది కుదించింది భారత్.
#WATCH | Delhi: Ministry of External Affairs (MEA) briefed selected envoys of G20 countries, including China and Canada, on the Pahalgam terror attack. The meeting lasted for 30 minutes.
(Visuals of ambassadors leaving from the office of the Ministry, located in the South Block… pic.twitter.com/Vrd415hamB
— ANI (@ANI) April 24, 2025
పాక్‌ని ఏకాకిని చేసేందుకు మరో వ్యూహాన్ని అమలుచేయనుంది భారత్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ… భారత్‌పై కవ్వింపులకు దిగుతున్న పాక్‌ను ప్రపంచదేశాల మద్దతుతో ఒంటరిని చేయాలన్న ప్లాన్ సిద్ధం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా, రష్యా, చైనా, శ్రీలంక, ఇటలీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలుదేశాలు ఖండించాయి. ఉగ్రవాదుల ఏరివేతకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై పోరాటంలో మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. దీంతో ప్రపంచదేశాల సపోర్టుతో పాక్‌ను భారత్ ఒంటరిని చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది.
ఇటు జీ20 దేశాల రాయబారులతోనూ భారత విదేశాంగ శాఖ భేటీ అయ్యింది. దౌత్యవేత్తలకు పహల్గామ్ ఉగ్రదాడి గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు భారత విదేశాంగ అధికారులు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీరును… భారత్‌పై పాక్ పదేపదే కవ్వింపులకు దిగుతున్న పరిణామాలను దౌత్యవేత్తలకు తెలియజేశారు. పాక్ కుట్రలను ఇటు అఖిలపక్ష సమావేశంలోనూ వివరించింది కేంద్రం. రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాక్ తీరుపై అన్నిపార్టీలు కన్నెర్ర చేశాయి. పాక్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా స్వాగతిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సైతం మద్దతిచ్చారు.
మొత్తంగా… పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు, భారత్ వైపు చూడాలంటేనే వణుకుపుట్టేలా చేసేందుందుకు ఇంటా బయటా మద్దతు కూడగడుతోంది కేంద్రం. అలాగే ప్రపంచదేశాల సపోర్ట్‌తో పాక్‌ను ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నెక్ట్స్ ఏం జరగబోతోందో చూడాలి మరి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..