
తమ చిన్నారులు పదో తరగతిలో పాస్ అయ్యారు.. దీంతో తల్లిదండ్రులు అవధులు లేకుండా పోయింది.. మంచి మార్కులతో తమ చిన్నారులు పాస్ అయ్యారని సంబరపడ్డారు.. దీంతో నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పయనమయ్యారు.. ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తిరుగు పయనమయ్యారు.. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి పైగా గాయపడ్డారు.. ఈ ఘటన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో జరిగింది. శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడి అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు.
వివరాల ప్రకారం.
కర్నూలు జిల్లా ఆదోని వాసులు తమ చిన్నారులు పదవ తరగతి మంచి మార్కులతో అయ్యారన్న సంతోషంలో.. స్వామి అమ్మ వాళ్ళకు మొక్కు చెల్లించేందుకు ఆ కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం పయనమయ్యారు. సంతోషంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే విధి వక్రీకరించి ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఐదుగురు చనిపోయారు. ఇంకా 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలంలోనే నలుగురు చనిపోగా ఆ తర్వాత కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..