
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కొడాలికి చెందిన కే కన్వెన్షన్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. గుడివాడ కరెంట్ ఆఫీసులో విచారణ చేసిన ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు.. అప్పటి విద్యుత్ ఏడీ, డీఈలను ఆరా తీశారు. గుడివాడ పరిధిలోని లింగవరంలోని కే కన్వెన్షన్ దగ్గర విజిలెన్స్ సీఐ డీజీ గంగా భవాని సారథ్యంలోని సిబ్బంది ఎంక్వైరీ నిర్వహించారు. కొడాలి నాని కే.కన్వెన్షన్ నందు 2020లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు అప్పటి సీఎం జగన్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా.. ఆ వెంచర్ చుట్టూ విద్యుత్ స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అయితే.. అధికారికంగా 60 కరెంట్ స్తంభాలు ఉండగా.. వెంచర్‌లో 78 ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన 18 కరెంట్ స్తంభాలతోపాటు రెండు ట్రాన్స్‌ఫార్మర్స్ అక్రమంగా ఏర్పాటు చేసినట్లు తేల్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు విజిలెన్స్ అధికారులు.
కాగా గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో… ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో కొడాలి నానికు బైపాస్ సర్జరీ చేశారు అక్కడి వైద్యులు. దీంతో ప్రస్తుతం ఆయన డాక్టర్లు సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..