
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. హీరోయిజం.. పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు పూరి. అప్పట్లో పూరి జగన్నాథ్ మూవీస్ వచ్చాయంటే థియేటర్లు మాస్ జాతర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. పూరి జగన్నాథ్ నుంచి సరైన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. డబుల్ ఇస్మార్ట్ తర్వాత కొంత కాలం గ్యా్ప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ హీరో టబుతోపాటు రాధిక ఆప్టే నటించనున్నట్లు కన్ఫార్మ్ చేశారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ సైతం కనిపించనుందట. ఆమె మరెవరో కాదు.. నివేదా థామస్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి భార్యగా నివేదా నటించనుందని సమాచారం. ఇందులో ఆమె పాత్ర సైతం భిన్నంగా ఉంటుందట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నివేదా థామస్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. వకీల్ సాబ్, జై లవకుశ, శాకిని డాకిని, వీ, నిన్ను కోరి వంటి చిత్రాలతో అలరించింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న నివేదా.. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..