Vastu tips for Mirror: ఇంట్లో వాస్తు దోషాలున్యాయా.. బెస్ట్ రెమిడీ అద్దం అని మీకు తెలుసా..!

వాస్తు ప్రకారం అద్దం కేవలం ఒక సాధారణ వస్తువు లేదా ప్రతిబింబాన్ని చూపించే ఒక వస్తువు మాత్రమే కాదు. ఇంట్లో పెట్టుకునే అద్దాలు ఇంటిలోని శక్తిని, సానుకూలతను, ప్రతికూల శక్తిని పెంచే శక్తిని కలిగి ఉంటాయి. సరైన స్థలంలో ఉంచిన అద్దం మీ ఇంట్లో సానుకూల శక్తిని .. కాంతిని పెంచుతుంది. అదే సమయంలో అద్దాన్ని తప్పుడు స్థానంలో పెడితే హాని కలిగించవచ్చు.

వాస్తు ప్రకారం అద్దం పెట్టాల్సిన దిశ

అద్దాలు సానుకూలతను ఆకర్షిస్తాయి. సరైన దిశలో అద్దాలను ఏర్పాటు చేసుకోవడం సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. అద్దంను కాంతి వచ్చే దిశలలో.. అంటే ఇంటి తూర్పు లేదా ఉత్తర గోడలపై ఉంచడం మంచిది. ఎందుకంటే ఈ దిశలు సానుకూల శక్తి , కాంతికి సంబంధించినవి. వీటిని పెంచడానికి అద్దాలు పనిచేస్తాయి.

వాస్తు దోషం తొలిగించేందుకు అద్దం ఎలా ఉపయోగించాలంటే

  1. అద్దాలు ఇంటి శక్తులను పెంచడానికి, సమతుల్యం చేయడానికి పనిచేస్తాయి. అదే సమయంలో అవి అనేక వాస్తు దోషాలను కూడా తొలగించగలవు. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే అద్దం సహాయంతో ఎలా మెరుగుపరచవచ్చో తెలుసుకుందాం.
  2. ఇల్లు లేదా వ్యాపార స్థలంలోని వాయువ్య మూల కత్తిరించబడి ఉంటే.. ఆ భాగం ఉత్తర గోడపై 4 అడుగుల వెడల్పు గల అద్దం ఉంచండి. ఇలా చేయడం వాస్తు దోషాన్ని తొలగిస్తుంది.
  3. ఈశాన్య మూల కత్తిరించినట్ల ఉంటే ఉత్తర గోడపై కత్తిరించిన భాగం లోపల అద్దం ఉంచండి.
  4. ఫ్లాట్ లిఫ్ట్ లేదా మెట్ల దగ్గర ఉంటే..ఇంటి ప్రధాన తలుపు మీద అష్టభుజాకార అద్దం పెట్టాలి.
  5. ఇంటి వెనుక లేదా ఫ్లాట్ వెనుక జాతీయ రహదారి ఉంటే ఇంటి వెనుక అష్టభుజి అద్దం ఏర్పాటు చేసుకోండి.
  6. బెడ్ రూమ్ లో అద్దాలను ఏర్పాటు చేసుకోవద్దు. అంటే బెడ్ రూమ్ లో అద్దం పెట్టడం సరికాదు.
  7. భోజనాల గదిలో అద్దం పెట్టడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ఎల్లప్పుడూ ఆహారం, సంపద సమృద్ధిగా ఉంటుంది.
  8. ఇంటి పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే ఎక్కువగా తెరిచి లేదా వెడల్పుగా ఉంటే.. తూర్పు గోడపై అద్దం ఉంచడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.