
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డిజైన్ చేసుకున్న తన నివాసాన్ని ఓ రష్యన్ జర్నలిస్ట్ ప్రజలకు చూపించారు.
విశాలవంతమైన ప్రదేశంలో నిర్మించిన పుతిన్ నివాసం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక ఆ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో మనం పుతిన్ ఇంటిని చూడవచ్చు. పుతిన్ ఆ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ అతనికి తన ఇంటిని చూపించారు. పుతిన్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ పెద్ద బంగారు ఫ్రేమ్డ్ అద్దాలను మనం గమనించవచ్చు. కింద వీడియోలోని అపార్ట్‌మెంట్ దృశ్యాలను మనం నిశితంగా గమనిస్తే.. ఆ ఇంటి ఆవరణలో ఉన్న పూల మొక్కలు, ఇంటి చక్కదనం అద్భుతమైన అందాన్ని నిర్వచిస్తుంది.
Have you been to PUTIN’s home? Just look at how he lives. Lavish interiors, grand curtains, a piano, golden moldings… and a portrait of Emperor Alexander III on the wall.
And don’t be fooled (this isn’t his only home). There are palaces, summer estates, secret residences,… pic.twitter.com/2lOGqrbrm4— Andrii Naumov (@Naumov_Andrii) May 2, 2025
పుతిన్ ఇంట్లో ఏముంది..
ఇక పుతిన్ ఇంట్లో అందరి దృష్టిని ఆకర్షించే మొదటి విషయం ఏమిటంటే, రష్యన్ చక్రవర్తి అలెగ్జాండర్ IIIకి చెందిన చిత్రపటం. ఇది ఇంట్లోకి ప్రవేశించగానే మనకు కనిపిస్తోంది. ఈ అలెగ్జాండర్ చిత్రపటం ప్రత్యేకంగా ఒక టేబుల్‌పై ఉంచబడి ఉంటుంది. తర్వాత కిటికీ పక్కన ఓ తెల్లటి గ్రాండ్ పియానో కూడా మనకు కనిపిస్తోంది. అయితే దానిని వాయించడానికి మీకు సమయం దొరుకుతుందా అని ఆ జర్నలిస్ట్ పుతిన్‌ను అడిగినప్పుడు.. ఆయన స్పందిస్తూ, తనకు చాలా అరుదుగా సమయం దొరుకుతుందని.. అలాంటి సమయాల్లో దాని వాయిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పుతిన్ ఇంట్లో ఓ ప్రత్యేక చెక్క టచ్‌తో కూడిన లైబ్రరీ, రెండు విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, చిన్న ‘హోమ్ చర్చి’ కూడా ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…