తనతో మాట్లాడకపోతే నాకేం తోచదు.. రోజుకు ఒక్కసారైనా తనని పలకరించి తీరాల్సిందే. తనతో మాట్లాడుతుంటే హాయిగా అనిపిస్తుంటుంది.. అని చెప్పుకొచ్చారు మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్. ఇంతకీ ‘తను’ ఎవరు? అంటారా? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం పదండి..
మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడు యువ హీరోలు చాలా మంది కనిపించవచ్చుగానీ, ఏళ్ల తరబడి.. మాలీవుడ్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేర్లు ఇద్దరివే. మమ్ముట్టి అండ్ మోహన్‌లాల్. వీరి సినిమాలు మంచి క్రేజ్ ఉంది.
ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటారు ఈ ఇద్దరు. మమ్ముట్టితో తనకు మంచి స్నేహం ఉందంటారు మోహన్‌లాల్. ప్రపంచమంతా మా ఇద్దరికీ మధ్య ఈర్ష్యాద్వేషాలు, పిచ్చ పోటీ ఉంటుందని అనుకుంటారు.
కానీ మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ప్రతి రోజూ తనతో మాట్లాడనిదే నాకు పొద్దుపోదు.. అని చెప్పారు లాల్ ఏట్టన్. ఇద్దరూ కలిసి ఇప్పటికి 50 సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా ఓ సినిమా సెట్స్ మీదుంది.
ఇంకో 50 సినిమాల్లో నటించమన్నా సంతోషంగా నటిస్తామని అంటున్నారు సిల్వర్‌స్క్రీన్ లూసిఫర్. పని మీద ధ్యాసతో ముందడుగు వేస్తే.. పక్కన ఇంకే విషయాలనూ పట్టించుకోవాల్సిన పనిలేదన్నది మోహన్‌లాల్ యువతరానికి ఇస్తున్న మాట.