
తెలుగు సినీ ప్రియుల్లో ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. డార్లింగ్ నటించిన అన్ని చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ప్రభాస్ సినిమాలు వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాంటి వాటిలో మిర్చి ఒకటి. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. 2013లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించగా.. నదియా, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ ఈచిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది రిచా. మిర్చి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు మారుమోగింది. దీంతో తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి.
రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిచా. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కనిపించింది. ప్రభాస్, రవితేజ సరసన మిర్చి, మిరపకాయ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ రెండు సినిమాలతో రిచాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నాగవల్లి, సారొచ్చారు చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు సినిమాల తర్వాత మరో మూవీలో కనిపించలేదు.
కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన రిచా.. ఆ తర్వాత తన స్నేహితుడు జో లాంగెల్లాను పెళ్లి చేసుకుంది. 2019లో వీరి వివాహం జరగ్గా.. 2021లో వీరికి బాబు జన్మించారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది రిచా. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రిచా ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..