
Imad Wasim Controversy: పాకిస్తాన్ క్రికెటర్లకు వివాదాలంటే చాలా ఇష్టం. తరచుగా ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటారు. నిత్యం గందరగోళం సృష్టించే ప్రకటనలతో హల్చల్ చేస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాళీ క్రికెట్ అయినా, మ్యాచ్ ఫిక్సింగ్ అయినా, లైవ్ మ్యాచ్‌లో ఫైటింగ్‌లైనా, పాకిస్తాన్ క్రికెటర్లు ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఒక మ్యాచ్ సందర్భంగా, పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం చేసిన ఒక చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం PSL 10వ సీజన్ పాకిస్తాన్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్ సందర్భంగా, పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం ప్రేక్షకుల పట్ల అసభ్యకరమైన సిగ్నల్ చేశాడు. ఇది అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇమాద్ వసీం పాకిస్తాన్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బౌలింగ్‌లో బాగా రాణిస్తున్నాడు. కానీ, తన చేష్టలతో మాత్రం నిరాశపరిచాడు.
ఫైర్ అవుతోన్న నెటిజన్లు..
విషయం ఏమిటంటే ఇమాద్ వసీం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇస్లామాబాద్ జట్టు లాహోర్ ఖలందర్స్‌తో తలపడిన మునుపటి మ్యాచ్‌ది. ఈ మ్యాచ్‌లో ఇమాద్ జట్టు మొదట బౌలింగ్ చేసింది. ఈ బౌలర్ స్వయంగా 2 వికెట్లు పడగొట్టడం ద్వారా కీలక పాత్ర పోషించాడు. కానీ, ఈ సమయంలో, అతను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ప్రేక్షకులు కొన్ని నినాదాలు చేస్తున్నారు.
ఇమాద్ అసభ్యకరమైన సిగ్నల్స్..
Imad to din ba din girta ja raha hai#HBLPSLX #PSLX #BabarAzam𓃵pic.twitter.com/CYYYfa7XPo
— Urooj Jawed
(@uroojjawed12) May 2, 2025
అయితే, ప్రేక్షకులు ఏ నినాదాలు చేస్తున్నారో స్పష్టంగా తెలియలేదు. కానీ బహుశా ఇది ఇమాద్‌ను కోపగించి ఉండవచ్చు. దీంతో ఈ పాకిస్తానీ ఆటగాడు కోపంతో ప్రేక్షకుల వైపు నేరుగా చూస్తూ, కాలితో తంతున్నట్లు సంజ్ఞలు చేశాడు. ఈ దురుసు చర్యకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇమాద్ వసీం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇమాద్ వసీం గతంలో తన ప్రకటనల కారణంగా వివాదాల్లో ఉన్నాడు. కానీ, ఇలాంటి చర్య కారణంగా పట్టుబడటం ఇదే మొదటిసారి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..