బృహస్పతిని దేవతలకు గురువుగా భావిస్తారు. ఏడాది కాలం పాటు బృహస్పతి ఒకే రాశిలో ఉంటాడు. మళ్లీ అదే రాశికి తిరిగి రావడానికి పుష్కరకాలం పడుతుంది. అంటే 12సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడా సమయం వచ్చింది. మే 14న రాత్రి సమయంలో గురు వృషభ రాశి నుంచి బయలుదేరి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడని వేద జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిశాస్రం ప్రకారం.. మే 14 నుంచి మిథున రాశిలోకి ప్రశించిన బృహస్పతి అక్టోబర్ 18 వరకు అదే రాశిలో ఉంటాడు. అయితే, అదే మిథున రాశిలో జూలై 26వ తేదీన శుక్రుడు అడుగుపెడతాడు. దీంతో మిథునంలో గురువు, శుక్ర కలయికతో జూలై 26న గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. మిథునంలో శుక్రుడు ఉండే ఆగస్టు 21వ తేదీ వరకు ఈ యోగం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశులకు విశేషంగా లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.
ధనుస్సు: సంతానం వల్ల ఏర్పడిన సమస్యలు పరిష్కారమవుతాయి. విధి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. జీవితంలో అనేక ఆదాయ మార్గాలను అన్ లాక్ చేసుకోవచ్చు. మీడియా, మార్కెటింగ్, క్రియేటివ్ పనుల్లో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. లగ్జరీ వస్తువులు మీ ఇంటికి వస్తాయని చెబుతారు.
సింహం: సింహ రాశివారికి ఇది మంచి సమయంగా చెబుతున్నారు. ఇది వీరికి అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య జూలైలో పరిష్కారమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది. అనేక ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల మీరు సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. మీ పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతాధికారుల మన్ననలు కూడా అందుతాయి.
కుంభం : కుంభ రాశివారికి కూడా ఈ యోగం చాలా లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. జీవితంలోని అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారని అంటున్నారు.. నిరుద్యోగులకు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగాలు మారాలని భావించే వారికి ఇది స్వర్ణయుగంగా చెబుతున్నారు. జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని, జీతం పెరుగుతుందని చెబుతారు.