
నంద్యాల జిల్లాలోని నల్లమల్ల ఫారెస్ట్ సమీపంలోని ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశువులపై పెద్ద పులులు, చిరుతల దాడులతో రైతులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడడంతో.. పొలాల వద్ద పశువులు ఉన్న రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి క్రూరమృగం వచ్చి దాడి చేస్తుందోననే భయంలో బతుకుతున్నారు. వెలుగోడు పట్టణ శివారులోని ప్రజలు వరుస పెద్దపులి దాడులతో బెంబేలెత్తుతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఓ ఆవుల మందపై దాడి చేసిన పెద్దపులి లేగదూడను చంపగా..మంగళవారం తెల్లవారుజామున మద్రాస్ కాల్వ సమీపంలో ఆవుల మందపై దాడి చేసి అదే రైతుకు చెందిన మరో దూడను చంపితింది.
వరుసగా రెండు రోజులు సేవానాయక్ అనే ఒకే రైతుకు చెందిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయడం స్థానిక రైతులను కలవరపెడుతోంది. అయితే తన పొలం వద్ద కట్టేసిన పశువులపై సోమవారం తెల్లవారుజామున పెద్దపులి దాడి చేసింది. ఈ పులి దాడిలో ఒక ఆవు చనిపోయింది. అయితే ఆ ప్రాంతాంలో పెద్దపులి సంచరిస్తోందని గ్రహించిన రైతులు తమ పశువులను మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వేరే రైతు పొలంలో వాటినికి కట్టేశారు. అయితే ప్లేస్ మారుస్తే పులి రాదనుకున్నారు. కానీ మంగళవారం తెల్లవారుజామున అక్కడికి కూడా వచ్చిన పులి అదే రైతుకు చెందిన ఆవుల మందపై దాడి చేసి మరో లేగదూడను చంపేసింది. పులిని చూసి రైతులు కేకలు వేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది. అయితే పులి దాడి చేస్తున్న సమయంలో చూసిన రైతులు దాన్ని తమ సెల్‌ఫోన్లలో రికార్డ్ చేశారు.
ఇదే విషయంపై స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పులుల, చిరుతల భారీ నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. ఇక చిరుత, పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు, స్థానిక రైతులు ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండకూడదని.. గుంపులుగానే ప్రజలు భయటకెళ్లాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..