
మనం రోజూ చూసే చీమలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. వాటి జీవితంలో అవి ఎక్కువ సమయం కష్టపడి పనిచేస్తునే ఉంటాయి. అయితే, చీమలు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాయా..? వాటికి అలసట, నిద్ర అనేవి ఉంటాయా..? అనే సందేహాలు మీలో కూడా ఎప్పుడో ఒకసారి కలిగే ఉండొచ్చు.. అయితే, ఇందుకు సమాధానం దొరికింది.! శ్రమ జీవులకు నిదర్శనంగా నిలిచే చీమలు ప్రతీ 12 గంటల వ్యవధిలో సగటున 8 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ శక్తిని దాచుకుంటాయట. ప్రతీ చీమ ఒకేసారి కాకుండా కొన్ని చీమలు విరామంలో ఉంటే మరికొన్ని పనిచేస్తాయట. అంటే షీఫ్టుల వారిగా అనుకుంటా..!
పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయని పరిశోధకులు చెబుతున్నారు ఇందులో రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయట.. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయట. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..