ఎవడ్రా సామీ.. 10వ నంబర్‌లో వచ్చి ఊర మాస్ ఇన్నింగ్స్.. 141 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్ ఏంటో తెలుసా?

Unbreakable Cricket Record: క్రికెట్ అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. ప్రతీ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదవుతుంటే, మరికొన్ని బ్రేక్ అవుతుంటాయి. అయితే, కొన్ని రికార్డులు ఇప్పటికీ బద్దలవ్వకుండా అనే ఉండిపోతుంటాయి. ఇలాంటి అరుదైన రికార్డులు క్రికెట్ హిస్టరీలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే రికార్డ్ కూడా ఇలాంటి కోవకే వస్తోంది. 10వ నంబర్ బ్యాట్స్‌మన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేశాడు. ఆ వికెట్ కోసం ప్రాధేయపడేలా చేశాడు.

10వ స్థానంలో బ్యాటింగ్‌కు..

టెస్ట్ క్రికెట్‌లో స్కోరు బోర్డును పరిగెత్తించే బాధ్యత బ్యాటర్లపై ఉంటుంది. కానీ, బ్యాట్స్‌మెన్ ఔట్ అయినప్పుడు, ప్రత్యర్థి జట్టు టెన్షన్ ముగుస్తుంది. 141 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఆస్ట్రేలియాకు టెన్షన్ లేకుండా పోయింది. ఈ ఇంగ్లాండ్ ఆటగాడు వికెట్లకు అడ్డంగా నిల్చుని, ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నవంబర్ 23, 1884న ఈ రికార్డ్ నమోదైంది. ఇది నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

10వ స్థానంలో సెంచరీ..

ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రికెటర్ వాల్టర్ రీడ్ (Walter Read) పేరిట ఉంది. టెస్ట్ క్రికెట్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులతో రికార్డ్ నమోదైంది. కష్ట సమయాల్లో తన జట్టు తరపున ఓవల్ టెస్టులో అతను 117 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ల కోసం అర్థిస్తూ కనిపించారు. 141 సంవత్సరాలుగా, ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. దీనిని సమం చేయడం కూడా సాధ్యం కాలేదు.

10వ స్థానంలో ఎన్ని సెంచరీలు..

ఆస్ట్రేలియాకు చెందిన రెగీ డఫ్ (104 పరుగులు), దక్షిణాఫ్రికాకు చెందిన పాట్ సింకాక్స్ (108 పరుగులు), బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ హసన్ (113 పరుగులు) కూడా 10వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీలు సాధించారు. కానీ, వాల్టర్ రీడ్‌ను సమం చేయడంలో సక్సెస్ కాలేదు. వాల్టర్ రీడ్ కెరీర్ 18 టెస్టులు ఆడాడు. ఈ కాలంలో, అతను నాల్గవ, ఐదవ, ఆరవ స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతన్ని 10వ స్థానంలో పంపారు. 551 పరుగులకు సమాధానంగా వాల్డర్ టీం 346 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాలో-ఆన్‌ను కూడా తప్పించుకోలేకపోయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.