
బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలోని రుని సైద్‌పూర్ బ్లాక్‌లోని అథారి పంచాయతీకి చెందిన 27 ఏళ్ల రాజ్ కృష్ణ ఝా UPSC 2025 పరీక్షలో ఎనిమిదో ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే రాజ్‌కి విజయం వరించలేదు. తన ఐదవ ప్రయత్నంలో ఈ విజయాన్ని సాధించాడు. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వెనకడుగు వేయక ముందుకే సాగడం వల్లనే సాధ్యమైందని అంటున్నాడు. రాజ్ విజయం అతని ఊరికే పండగ వాతావరణం తీసుకువచ్చింది. మొత్తం జిల్లాలోనూ వేడుకల వాతావరణం నెలకొంది.
తన మొదటి రెండు ప్రయత్నాలలో రాజ్ కృష్ణ కనీసం ప్రిలిమినరీ పరీక్షను కూడా పాస్ కాలేకపోయాడు. మంచి ర్యాంకు సాధించాలనే ఉద్దేశ్యంతో పరీక్షకు పట్టుదలతో హాజరయ్యాడు. కానీ 5వ అటెంప్ట్‌లో అతను అద్భుతంగా 8వ ర్యాంకును సాధించాడు. కొల్హాపూర్‌లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘నా నాల్గవ ప్రయత్నంలో మెయిన్స్ పరీక్షలో 739 మార్కులు వచ్చాయి. కానీ కేవలం రెండు మార్కుల తేడాతో ఎంపిక కోల్పోయాను. ఆ తర్వాత పరీక్షలో టాప్ 10 ర్యాంక్ పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని అన్నారు. మాక్ టెస్ట్‌లలో కూడా బాగా రాణిస్తున్నందున నా విజయంపై నాకు నమ్మకం బలపడిందని తెలిపాడు.
రాజ్ ఎక్కడ చదువుకున్నారంటే..?
రాజ్ కృష్ణ ప్రాథమిక విద్యను నేపాల్‌లోని భిటమోర్ సరిహద్దు సమీపంలోని ఓ పాఠశాలలో చదివాడు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BSEB) కింద 12వ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. దీని తరువాత అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNNIT) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో B.Tech డిగ్రీని పొందాడు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో, అతను హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని BPCL సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
తండ్రి ప్రైవేట్ స్కూల్ టీచర్..
తన తండ్రి సునీల్ కుమార్ ఝా ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడని, తన కెరీర్‌ను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని రాజ్ కృష్ణ చెప్పాడు. తన విజయానికి తన తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులే కారణమని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సమాజంలో పెద్ద పాత్ర పోషించేలా తనను ఎంతగానో ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసింది తన తండ్రేనని ఆయన అన్నారు. ఇక ఆయన తాత సుల్పాని ఝా ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన సోదరి ఎంబీబీఎస్ డాక్టర్. కలెక్టర్ కావాలనే దృఢ నిశ్చయంతో మొదటి రెండు ప్రయత్నాలలో విఫలమైనప్పటికీ, తాను UPSC ప్రిపరేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని తెలిపాడు, ఇలా రోజుకు 14-15 గంటలు చదవడం ప్రారంభించానని అన్నాడు. UPSC పరీక్షలో హిందీ, భౌగోళిక శాస్త్రాలను ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకున్నట్లు తెలిపాడు. ఆయన కుటుంబం గురించి మాట్లాడుకుంటే,
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.