
తాజా ఆహారం మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల శరీరంలో నీరసం వచ్చేస్తుంది. ప్రతి రోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా.. దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో బలంగా ఉండేవారు. ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ధ్యానం చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ఒత్తిడి తగ్గి, అప్రమత్తత పెరుగుతుంది. దీనితో రోజంతా మెదడు, శరీరం చురుకుగా ఉంటాయి. అలాగే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా వాకింగ్ చేయడం చాలా అవసరం. వేసవికాలంలో ఉదయం కనీసం అరగంటైనా నడిస్తే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని చెబుతారు.