
ప్రకృతి ప్రేమికులా, ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించాలనుకుంటున్నారా బీహార్‌లోని నవాడ జిల్లాలో ఉన్న కాకోలాట్ జలపాతాన్ని తప్పక సందర్శించండి. ఈ అందమైన జలపాతంలోని నీరు సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంది. దీని చుట్టూ పచ్చని అడవులు, కొండలు ఉన్నాయి. దీంతో ప్రకృతి అందానికి పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసిన వారి హృదయం ఉప్పొంగిపోతుంది. కకోలాట్ జలపాతం నవాడ నుంచి దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. బీహార్ .. జార్ఖండ్ సరిహద్దులో ఉన్న ఈ జలపాతం ప్రకృతి కళాత్మకతకు అద్భుతమైన ఉదాహరణ.
ఇది మనిషి ఎంత అందంగా ఎన్నిటిని సృష్టించినా.. అది ప్రకృతి సృష్టికి దగ్గరగా కూడా రాలేదని మనకు చెబుతుంది. ఈ జలపాతం నీరు ఎత్తు నుంచి కింద పడుతుంటే చూడడం ఓ అద్భుతంగా ఉంటుంది. మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ జలపాతం భారతదేశంలోని అత్యుత్తమ జలపాతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని నీరు ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. చైత్ర మాసంలోని సంక్రాంతి రోజున ఈ ప్రదేశంలో ఒక జాతర నిర్వహిస్తారు.
జలపాతంతో సంబంధం ఉన్న ఒక పురాణ కథ ఏమిటంటే
పురాణాల ప్రకారం త్రేతా యుగంలో ఒక ఋషి ఒక రాజును కొండచిలువ రూపాన్ని ధరించి ఇక్కడ నివసించమని శపించాడు. అప్పటి నుండి రాజు శాపం ప్రకారం ఈ ప్రదేశంలో నివసిస్తున్నాడు. పాండవులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు రాజుకు ఈ జలపాతంలో స్నానం చేయడంతో శాపం నుంచి విముక్తి లభించింది. అప్పటి నుంచి భక్తులు ఈ జలపాతం నీటిలో స్నానం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్న ఒక జానపద కథ కూడా ఉంది. దాని ప్రకారం కృష్ణుడు తన రాణులతో కలిసి స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చేవాడు. ఈ కారణంగా కూడా ఈ జలపాతం నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు.
ఎలా వెళ్ళాలంటే
వాయు మార్గం: జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.
రైలు మార్గం: నవాడ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. నవాడ నేరుగా లఖిసరై .. గయ రైల్వే స్టేషన్లలో దిగాల్సి ఉంటుంది.
రోడ్డు మార్గం: నవాడ సమీప ప్రదేశాలకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..