
కాగితాలపై తమ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా.. ఇక్కడి జీవన ప్రమాణాలు చూస్తే, అసలు భారత్‌లో ఉండటం అవసరమా అనిపిస్తోందని ఆయన తన పోస్టులో రాశఆరు. మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వైద్యం విషయంలోనూ అనేక లోపాలున్నాయని, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న విషయాన్ని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు. తాను నివసించే హొరమావు ప్రాంతంలో 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 40 నిమిషాలు పడుతోందని, ఆఫీసుకు చేరేసరికే నీరసించిపోతున్నామని అన్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉంటున్నాయని, ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పనులు జరుగుతూనే ఉంటాయని అసహనం వ్యక్తం చేశారు. తాము చెల్లిస్తున్న భారీ పన్నులకు తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆయన వాపోయారు. తమ ఆదాయంలో 30 నుంచి 40% పన్నులకే పోతోందని, బదులుగా తమకు ఏం లభిస్తోందని ప్రశ్నించారు. ఉచిత వైద్యం లేదు, సరైన విద్య లేదు, కనీసం తాగడానికి సురక్షితమైన నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెనడా, జర్మనీ తదితర దేశాల్లో అధిక పన్నులు ఉన్నా ఉచిత విద్య, వైద్యం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటాయని అన్నారు. దుమ్ము, ధూళి, రణగొణ ధ్వనులు, ఒత్తిడి, రోడ్ రేజ్ వంటి సమస్యలతో ప్రశాంతంగా బయట నడవలేని పరిస్థితి నెలకొందని, కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. సాయంత్రం 7 తర్వాత తన భార్యను ఒంటరిగా బయటకు పంపేందుకు భయంగా ఉందన్నారు. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదన్న అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పశువుల పాకలో వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా షాకింగ్ సీన్..!
క్షణ క్షణం.. భయం భయం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది ??
తరుచూ తలనొప్పి పరేషాన్ చేస్తోందా ?? ఈ పని చేయండి ఇట్టే పోతుంది..!
ఎండాకాలమని మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా ??
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అతిగా తింటున్నారా ?? అయితే మీకు