
ప్రముఖ పిన్‌టెక్ సంస్థ పేటీఎం 2024-25 సంవత్సరానికి సంబంధించి Q4 ఫలితాలు తాజాగా ప్రకటించింది. తాజా ఫలితాల్లో Paytm ఆదాయం రూ.1,911 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. ESOP లాభదాయకతకు ముందు రూ.81 కోట్ల EBITDA సాధించిందని పేర్కొంది. ప్రాఫిట్ ఆఫర్ ట్యాక్స్ (PAT) రూ. 23 కోట్లకు మెరుగుపడటంతో పూర్తి లాభదాయకతకు దగ్గరగా ఉందని పేటీఎం వెల్లడించింది. రూ.70 కోట్ల UPI ప్రోత్సాహకాలను అందుకోగా.. రూ.12,809 కోట్ల నగదు నిల్వను ఉన్నట్లు ప్రకటించింది.
జనవరి-మార్చి త్రైమాసికంలో పేటీఎం తన ఆదాయం 5 శాతం పెరిగి రూ.1,911 కోట్లకు చేరుకుందని నివేదించింది. బలమైన కార్యాచరణ మెరుగుదలలు, స్థిరమైన వ్యాపార వృద్ధిని ప్రతిబింబిస్తూ కంపెనీ తన నష్టాన్ని కేవలం రూ.23 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. 2024-25లో కంపెనీ UPI ప్రోత్సాహకాలలో రూ. 70 కోట్లు అందుకుంది. మరోవైపు కంపెనీ ESOP లాభదాయకతకు ముందు EBITDAని సాధించింది, ఈ త్రైమాసికంలో ESOPకి ముందు EBITDA రూ.81 కోట్లకు మెరుగుపడింది. ప్రోత్సాహకాన్ని మినహాయించి EBITDA QoQలో రూ.51 కోట్లు మెరుగుపడి రూ.11 కోట్లకు చేరుకుంది. వ్యయ సామర్థ్యాలు, స్థిరమైన చెల్లింపుల వృద్ధి, ఆర్థిక సేవల ఆదాయాన్ని విస్తరించడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.
మరోవైపు కంపెనీకి రూ.522 కోట్ల అసాధారణ వ్యయం కూడా తగ్గింది. ఈ అసాధారణ ఖర్చులను తగ్గించడంతో కంపెనీ PAT రూ.23 కోట్లకు మెరుగుపడింది. UPI ప్రోత్సాహకం, వన్-టైమ్ ఛార్జీలు రెండింటినీ మినహాయించి, PAT రూ.115 కోట్లు పెరిగి రూ.93 కోట్లకు చేరుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో పేటీఎం తన నిర్వహణ ఆదాయంలో 5 శాతం వృద్ధిని నమోదు చేసుకుని రూ.1,911 కోట్లకు చేరుకుంది. కాంట్రిబ్యూషన్ లాభం రూ.1,071 కోట్లకు పెరిగింది. ఇది క్యూ4తో పోలిస్తే 12% ఎక్కువ. కాంట్రిబ్యూషన్ మార్జిన్ 56% మెరుగుపడింది. ఆర్థిక సేవల నుండి కంపెనీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.545 కోట్లకు చేరుకుంది. వ్యాపారి రుణ పంపిణీలు రూ.4,315 కోట్లుగా ఉన్నాయి.
ఈ త్రైమాసికంలో 50 శాతం కంటే ఎక్కువ రుణాలు పునరావృత రుణగ్రహీతలకు ఇచ్చింది. కంపెనీ నికర చెల్లింపు మార్జిన్ రూ. 578 కోట్లుగా ఉండటంతో చెల్లింపులు స్థిరమైన రాబడిని అందించింది. ఇందులో UPI ప్రోత్సాహకం నుంచి రూ. 70 కోట్లు ఉన్నాయి. ప్రోత్సాహకం మినహాయిస్తే మార్జిన్ రూ. 508 కోట్లుగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో 4 శాతం వృద్ధిని సూచిస్తుంది. పేటీఎం కూడా ఈ త్రైమాసికాన్ని రూ. 12,809 కోట్లతో ట్రేడ్‌ను ముగించింది. ఇది భవిష్యత్ వృద్ధికి బలమైన ఆధారాన్ని అందిస్తుందని పేటీఎం తన ప్రకటనలో పేర్కొంది. Paytm చెల్లింపుల సంఖ్య ఈ త్రైమాసికంలో 8 లక్షలు పెరిగి మొత్తం 1.24 కోట్లకు చేరుకుంది. దేశంలో మొట్టమొదటి సోలార్ సౌండ్‌బాక్స్, మహాకుంభ్ సౌండ్‌బాక్స్‌లను ప్రారంభి పేటీఎం కంపెనీ తన ఆవిష్కరణను బలోపేతం చేసుకుంది. ఈ కొత్త ఉత్పత్తులు సౌండ్‌బాక్స్ విభాగంలో Paytm ఆధిపత్యాన్ని బలోపేతం చేసింది. Paytm వ్యాపారి రుణ పంపిణీ వ్యాపారం అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇది 2021-22లో రూ.1,403 కోట్ల నుంచి 024-25 నాటికి రూ.13,602 కోట్లకు పెరిగింది. రుణాలు పొందుతున్న వ్యాపారుల సంఖ్య 10 లక్షలు దాటింది. 50 శాతానికి పైగా చెల్లింపులు పునరావృత రుణగ్రహీతలకు చేరుతున్నాయి. మార్చి 2025 నాటికి పేటీఎం నగదు నిల్వ రూ.12,809 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.