
దుబాయ్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారత బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నికి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తన రోల్స్ రాయిస్ కారు నంబర్ ప్లేట్‌ను రూ.60 కోట్లకు కొనుగోలు చేసిన సాహ్ని.. అతని కొడుకుతో సహా 32 మందికి కోర్టు శిక్ష విధించింది. ఇది మాత్రమే కాదు, దుబాయ్ కోర్టు అతనికి దేశ బహిష్కరణ శిక్ష కూడా విధించింది. దీని అర్థం అతని జైలు శిక్ష పూర్తయినప్పుడు సాహ్ని దుబాయ్ వదిలి వెళ్ళవలసి ఉంటుంది.
సాహ్ని గత ఏడాది ఫిబ్రవరిలో ఒక మోసం కేసులో అరెస్టయ్యాడు. సహానీపై యుఎఇ బ్యాంకు నుండి 10 కోట్ల దిర్హామ్‌ల రుణం తీసుకొని దుర్వినియోగం చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగాలను విచారించిన తర్వాత దుబాయ్ కోర్టు అతనికి 5 లక్షల దిర్హామ్‌ల (సుమారు రూ. 1.14 కోట్లు) జరిమానా కూడా విధించింది. దీనితో పాటు, 15 కోట్ల దిర్హామ్‌లను (సుమారు రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. సాహ్ని పెద్ద కొడుకు కూడా మోసం, మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి శిక్ష అనుభవించాడు.
బల్విందర్ సాహ్ని:
సాహ్నిని దుబాయ్‌లో అబూ సబా అని కూడా పిలుస్తారు. భారత సంతతికి చెందిన ఈ బిలియనీర్ దుబాయ్‌లోని RGS గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని. అతని వ్యాపారం UAE, అమెరికా, భారతదేశంతో సహా అనేక దేశాలలో విస్తరించి ఉంది. సహాని 1972లో కువైట్‌లో జన్మించారు. వాహనాల విడిభాగాలను అమ్మడం ద్వారా తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక అంచనా ప్రకారం, సాహ్నికి దాదాపు $2 బిలియన్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
2016లో సహానీ నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేయడంతో అతని పేరు వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తన రోల్స్ రాయిస్ కారుకు డీ5 నంబర్ ప్లేట్‌ను 3.3 కోట్ల దిర్హామ్‌లకు (సుమారు రూ. 60 కోట్లు) కొన్నాడు. ఈ ధర కారు ధర కంటే చాలా రెట్లు ఎక్కువ. తన దగ్గర దుబాయ్, అబుదాబి నంబర్లతో 5 కార్లు ఉన్నాయని, వాటన్నిటి ధర కారు ధర కంటే ఎక్కువ అని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది మాత్రమే కాదు, అతని దగ్గర చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి ఒక నల్లటి బుగట్టి కారు కూడా కొన్నాడు. 2006 సంవత్సరంలో తన కారు నంబర్ ప్లేట్‌లో రెండు అంకెలు ఉన్నందున తనకు లైసెన్స్ రాలేదని అతను ఇంత ఖరీదైన నంబర్ ప్లేట్ కొనడానికి కారణమని చెప్పాడు. అందుకే అతను ఇప్పుడు సింగిల్ డిజిట్ నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
మోసం ఎలా జరిగింది?
ఖలీజ్ టైమ్స్ ప్రకారం.. బల్విందర్ సాహ్ని ఒక క్రిమినల్ సంస్థతో కలిసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు. నకిలీ కంపెనీలను సృష్టించడం ద్వారా అతను దాదాపు 15 కోట్ల దిర్హామ్‌లను మోసం చేశాడు. ఇది కాకుండా, అనేక అనుమానాస్పద లావాదేవీలు కూడా దర్యాప్తులో బయటపడ్డాయి. ఈ ఆరోపణలు నిజమని తేలిన తర్వాత దుబాయ్ నాల్గవ క్రిమినల్ కోర్టు అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే అతని అన్ని నిధులు, ఎలక్ట్రానిక్ పరికరాలను జప్తు చేశారు. సాహ్నితో పాటు, అతని పెద్ద కుమారుడు, మరో 32 మందికి కూడా శిక్ష విధించారు. కొంతమంది నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. అలాగే వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి