
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది. కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ కూడా ఈ సిరీస్ ను ఎగబడి చూశారు. దీని దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ అవార్డులు సైతం దక్కాయి. దీంతో స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఈ సిరీస్ కూడా మొదటి పార్ట్ రేంజ్ లో కాకపోయినా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇలా రెండు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్ ను కూడా తీసుకొస్తున్నారు మేకర్స్. రెండో సీజన్ లోనే మూడో పార్ట్ పై హిం్ ఇచ్చారు. తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది అలాగే ఈ సీజన్ కు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
‘స్క్విడ్‌గేమ్ 3’లో ఏం చూపనున్నారంటే..!
స్క్విడ్‌గేమ్ సీజన్ 2 సిరీస్ మొత్తం షియెంగ్ జీ హున్ చుట్టే తిరిగింది. అతను ‘స్క్విడ్ గేమ్’ అన్ని దశలు పూర్తి చేసి, 45.6 బిలియన్ కొరియన్ వన్‌లు గెలుచుకుంటాడు. కానీ మనుషుల ప్రాణాలు తీసే ఈ డేంజరస్ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలనుకుంటాడు షియెంగ్. ఈ గేమ్ ఆడిస్తున్నమాస్క్ కలిగిన ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టాలనుకుంటాడు. మరి షియెంగ్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఫ్రంట్‌మ్యాన్‌ను అంతం చేశాడా.. లేదా అన్నది సీజన్ 3 లో చూపించనున్నారు. కాగా ఈ టీజర్‌ను షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్..‘చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్క్విడ్‌గేమ్ 3 టీజర్
Player 456 returns, one final time
Watch the final season of Squid Game out 27 June, only on Netflix pic.twitter.com/lg5GUzsWT6— Netflix India (@NetflixIndia) May 6, 2025
జూన్ 27 నుంచి స్ట్రీమింగ్..
Khel khatam
The final games begin.
Watch Squid Game Season 3, out 27 June, only on Netflix. pic.twitter.com/BdrN4V1Yva— Netflix India (@NetflixIndia) May 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.