
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఉగ్రదాడిపై దర్యప్తును ముమ్మరం చేసిన ఎన్‌ఐఏ కీలక విషయాలను రాబట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి మాదిరి దేశంలో మరిన్ని దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రచేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు దేశ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పంజాబ్‌లో ఓ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పోలీసులు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో ఉగ్రకుట్రను భగ్నం చేశారు అధికారులు. జిల్లా శివారులోని అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆ ప్రాంతంలో నిఘా వర్గాల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించారు. వారి స్థావరాలపై దాడి చేసి ఉగ్రకుట్రను భగ్నం చేశారు.
ఇక వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఉగ్రవాదులు వినియోగిస్తున్న వైర్‌లెస్ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పంజాబ్ పోలీసులు ఈ ఉగ్రకుట్రను భగ్నం చేయగలిగాలరు.
కేంద్ర బలగాల సమన్వయంతో పంజాబ్ పోలీసులు ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసున్నారు. రెండు రాకెట్-ప్రొపెల్డ్ గ్రనేడ్‌లు, ఐదు పి-86 హ్యాండ్ గ్రనేడ్‌లు, రెండు ఇంప్రూవైజ్జ్ పేలుడు పరికరాలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్, కొంత మేర మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…