
వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తినాలో మీకు తెలుసా..? శరీరానికి కావలసిన పోషకాలు తీసుకోవాలంటే ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. ఈ కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. ప్రతి రోజు శరీరం పని చేయడానికి అవసరమైన పోషకాలు ఆకుకూరలతో లభిస్తాయి.
చాలా మంది ఆకుకూరలు తినాలంటే చిరాకు పడతారు. రుచి అంతగా నచ్చకపోవచ్చు. కొన్ని కూరల వాసన వల్ల భయపడుతారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
మీకు ఆకుకూరలు నచ్చకపోయినా కనీసం వారానికి కొన్ని రోజులు మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల మీరు వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు.
ఆకుకూరలు తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సమస్యలు తగ్గుతాయి. రోజూ తినలేకపోయినా వారానికి కొన్ని రోజులు తప్పక తినాలి.
వారానికి కనీసం మూడు సార్లు ఆకుకూరలు తినడం మంచిది. ఉదయం లేదా రాత్రి భోజనాల్లో చేర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు బలపడతాయి. శరీరం సరిగా పనిచేస్తుంది.
ఆకుకూరలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెకు మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మం బాగా మెరుస్తుంది. కేశాలు బలంగా ఉంటాయి. సంతాన సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
పిల్లలకి చిన్ననాటి నుంచే ఆకుకూరలు తినే అలవాటు పెడితే భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్లుగా పెరిగిన తర్వాత అలవాటు లేకుండా ఉంటే తినడం కష్టం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పాలి.
ఆకుకూరలు అన్నంలో కలిపి, పరాటాలో పెట్టి, పప్పుతో కలిపి తినొచ్చు. రుచి బాగా రావాలి అంటే కొద్దిగా నెయ్యి లేదా నూనెతో వేపి తినవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తింటారు.