ఇక కూతురుకు పెళ్లి చేసి పంపే క్రమంలో ప్రతి తల్లి తన కూతురుకు మంచి చెడు, అక్కడ ఇంట్లో ఎలా మెదలాలి, భవిష్యత్తులో ఆదర్శవంతమైన కోడలిగా, తల్లిగా, భార్యగా ఎలా గుర్తింపు తెచ్చుకోవాలో వివరంగా చెబుతుంది. కానీ భర్త తన భార్యను ఎలా చూసుకోవాలి, భార్యతో వారి బంధువులతో ఎలా మెదలాలో ఎవ్వరూ అతనకి చెప్పరు.అయితే ప్రేమానంద్ మహారాజ్ భర్త విధి ఏంటి, భార్యతో భర్త ఎలా ఉండాలి. భార్యను సంతోషపెట్టడానికి ఏం చేయాలో తెలియజేశారు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ప్రేమానంద మహారాజ్ భర్త విధుల గురించి చెబుతూ.. ప్రతి భర్త తన భార్యను ఆమె జీవితంగా భావించాలని తెలిపారు. అంతే కాకుండా తమ జీవితం ఎప్పుడూ ఆనందంగా, ఉండేలా చూసుకోవాలి. వారి అవసరాలను అర్థం చేసుకోని వెంటనే వాటిని తీర్చాలి. బాధపడకుండా చూడాలి, ఆమె భావాలను కోరికలు గౌరవించాలి, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆమెకు తోడుగా నీడగా ఉండాలని చెబుతున్నారు.
ముఖ్యంగా భార్య అంటే మీ ఇంటి ఇల్లాలు అలాంటి వ్యక్తిని ఎప్పుడూ గౌరవంగా చూడాలి. అందరి ముందు చులకనగా మాట్లాడకూడదు. భార్య మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక భర్త భార్యను గౌరవంగాను ప్రేమగాను,గౌరవంగాను, ఒక స్నేహితురాలుగాను చూడాలని ఆయన తెలిపారు.
అంతేకాకుండా ఆయన ఇంకా చెబుతూ.. భర్త భార్యను సంప్రదించకుండా ఏ పని చేయకూడదు. ఏ నిర్ణయం తీసుకున్న మీ భార్యను సంప్రదించడం ఆమె నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అంట. అంతే కాకుండా ఏ చిన్న పని చేసినా సరే ఇద్దరూ కలిసే చేయాలంట.
అదే విధంగా ఏ చిన్న వర్క్ చేసినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. పరస్పర చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవాలంట. ఇలా ప్రతి విషయంలో మీరు మీ భార్యకు సపోర్ట్ ఇస్తూ.. తనను ఇష్టాయిష్టాలను గౌరవించడం వలన మీ భార్య చాలా ఆనందంగా ఉంటుందంట. ప్రతి భర్త తప్పకుండా ఈ నియమాలు పాటించాలంటున్నారు ప్రేమానంద మహారాజ్.