ఆ మధ్య మీడియాకు దూరంగా ఉన్న శ్రుతి.. ఇప్పుడు చాలా విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నా చిన్నతనంలో అలా జరిగింది.. ప్రేమలో ఇలా జరిగింది.. అంటూ లైఫ్‌ని ఓ సారి రివ్యూ చేసుకుంటున్నారు. ఇంత సడన్‌గా లైమ్‌లైట్‌లోకి రావాల్సిన అవసరం ఏంటి?
సలార్ కంప్లీట్ చేసిన శ్రుతి… మళ్లీ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారా? అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది కూలీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ భామ. రీసెంట్గా తన లైఫ్‌ని ఓ సారి రివ్యూ చేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి బెంజిలో తిరిగానని గుర్తుచేసుకున్నారు శ్రుతి. అయితే తన అమ్మానాన్నలు విడిపోయాక ముంబైలో మెట్రో ఎక్కాల్సి వచ్చిందన్నారు. ప్రేమ గురించి కూడా మాట్లాడారు ఈ బ్యూటీ. తన ప్రేమ విఫలమైన ప్రతి సారీ బాధ ఎక్కువగా ఉంటుందన్నారు.
ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని కొందరు అడిగే తీరు బాధ కలిగిస్తుందన్నారు. అన్నిసార్లు ప్రేమ విఫలమవుతుంటే మనసు విరిగిపోతుందన్నారు. బ్రేకప్ అయినంత మాత్రాన అవతలి వ్యక్తి గురించి తాను చెడుగా మాట్లాడనని చెప్పారు.
కెరీర్ ప్రారంభంలో సినిమాలు బాగా ఆడనప్పుడు అన్ లక్కీ అని ముద్ర వేశారని, గబ్బర్‌సింగ్‌తో హిట్ వచ్చాకే తన కెరీర్ ట్రాక్‌లో పడిందని గుర్తుచేసుకున్నారు శ్రుతి. ప్రస్తుతం కూలీ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు.