పవన్ లైనప్‌లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్. కానీ పొలిటికల్ గా బిజీ కావటంతో లిస్ట్‌లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తోంది.
పవన్ సెట్లో అడుగు పెట్టబోతున్నారన్న న్యూస్ రావటంతో ఉస్తాద్ విషయంలోనూ కదలిక కనిపిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్.
ఆల్రెడీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల లిస్ట్‌లో ఉన్న పవన్, ఇప్పుడు అంతకు మించి పేమెంట్ తీసుకోవటం అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ డిస్కషన్ పాయింట్ అవుతోంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్, ఇప్పుడు అదే కాంబినేషన్లో మరోసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తుండటంతో హిస్టరీ రిపీట్ అవ్వటం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.