
IPL 2025 Points Table updated after SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లేఆఫ్‌ల కోసం పోటీ ప్రతి మ్యాచ్‌తో మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు బలమైన పోటీదారులుగా నిలిచాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రేసులో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, సోమవారం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ, వర్షం కారణంగా ఈ మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇటువంటి పరిస్థితిలో, ఐపీఎల్ 2025 (IPL 2025) పాయింట్ల పట్టికపై ఈ మ్యాచ్ ప్రభావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు..
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైదరాబాద్‌లో జరిగిన 55వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అక్షర్ పటేల్ జట్టు 20 ఓవర్లలో 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ తప్ప, మరే ఇతర ఆటగాడూ పరుగులు సాధించలేదు.
ఈ ఇద్దరు ఆటగాళ్ళు తలో 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. విప్రజ్ నిగమ్ 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫాఫ్ డు ప్లెసిస్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్ వరుసగా 3, 6, 8, 1 పరుగులు చేశారు.
పాట్ కమ్మిన్స్ మాయజాలం..
ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. పవర్‌ప్లే ముగియడానికి ముందే అతను ఢిల్లీ టాప్-3 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు తిరిగి పంపాడు. మ్యాచ్‌లో హైదరాబాద్ (SRH) తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కరుణ్ నాయర్‌ను అవుట్ చేసిన తర్వాత, అతను అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్‌లను అవుట్ చేశాడు. అతడితో పాటు జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ఒక్కో వికెట్ తీశారు.
ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో హైదరాబాద్ పరిస్థితి దారుణం..
SRH vs DC మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద దెబ్బ తగిలింది. పాట్ కమ్మిన్స్ జట్టు ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంది. అయితే, ఢిల్లీ, హైదరాబాద్ జట్లు తలో పాయింట్ పంచుకున్నాయి. దీంతో IPL 2025 పాయింట్ల పట్టికలో ఏడు పాయింట్లతో, హైదరాబాద్ పాయింట్ల పట్టికలో (IPL 2025 పాయింట్ల పట్టిక) ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
దీని కారణంగా, రాజస్థాన్ రాయల్స్ తొమ్మిదో స్థానానికి రావలసి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడు ఢిల్లీ ప్లేఆఫ్స్ కోసం తన వాదనను బలోపేతం చేసుకోవాలంటే, మిగిలిన మూడు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సి ఉంది.
IPL 2025 పాయింట్ల పట్టికను ఇక్కడ చూడండి:
క్రమసంఖ్య | జట్టు | మ్యాచ్‌లు | విజయం | ఓటమి | ఫలితం తేలని మ్యాచ్‌లు | నెట్ రన్ రేట్ | పాయింట్లు |
1 | రాయల్ ఛాలెంజరస్ బెంగళూరు | 11 | 8 | 3 | 0 | 0.482 | 16 |
2 | పంజాబ్ కింగ్స్ | 11 | 7 | 3 | 1 | 0.376 | 15 |
3 | ముంబై ఇండియన్స్ | 11 | 7 | 4 | 0 | 1.274 | 14 |
4 | గుజరాత్ టైటాన్స్ | 10 | 7 | 3 | 0 | 0.867 | 14 |
5 | ఢిల్లీ క్యాపిటల్స్ | 11 | 6 | 4 | 1 | 0.362 | 13 |
6 | కోల్‌కతా నైట్ రైడర్స్ | 11 | 5 | 5 | 1 | 0.249 | 11 |
7 | లక్నో | 11 | 5 | 6 | 0 | -0.469 | 10 |
8 | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 11 | 3 | 7 | 1 | -1.192 | 7 |
9 | రాజస్థాన్ రాయల్స్ | 12 | 3 | 9 | 0 | -0.718 | 6 |
10 | చెన్నై సూపర్ కింగ్స్ | 11 | 2 | 9 | 0 | -1.117 | 4 |
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..