పిల్లల అభివృద్ధిలో తల్లి, తండ్రి చాలా ముఖ్యం. తల్లిదండ్రుల పాత్ర పిల్లలపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు తండ్రులే ఆదర్శప్రాయులు. చాలా మంది పిల్లలు తమ తల్లి మాట వినకపోవచ్చు కానీ తమ తండ్రి మాటకు మాత్రం చాలా అవిధేయత చూపుతారు. అయితే తండ్రి తన పిల్లలకు సమాజంలో ఎలా జీవించాలి? కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? వంటి కొన్ని విషయాలను నేర్పించాలి. ఇది ప్రతి తండ్రి బాధ్యత.
కొంతమంది పిల్లలు తమకంటే పెద్దవారితో గౌరవంగా మాట్లాడరు. ఈ సందర్భంలో ఇతరులను గౌరవించడం ఎంత ముఖ్యమో, మన చిన్న చర్యలు ఎంత ప్రభావాన్ని చూపుతాయో తండ్రి తన పిల్లలకు నేర్పించాలి. అలాగే చాలా మంది పిల్లలు ఎదిగాక తమ తల్లిదండ్రులను రోడ్డున పడేస్తుంటారు. ఈ సందర్భంలో ప్రతి తండ్రి తన పిల్లలకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు, కుటుంబ విలువల గురించి నేర్పించాలి.
ప్రతి తండ్రి తన పిల్లలకు విజయానికి సత్వరమార్గాలు లేవని నేర్పించాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుందని, విజయం సాధిస్తామని తండ్రి తన పిల్లలకు నేర్పించాలి. ప్రతి తండ్రి తన పిల్లలకు భయాలు, ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, ధైర్యంగా ఎలా ఉండాలో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో కూడా నేర్పించాలి.
ఒక తండ్రి తన పిల్లలకు బాధ్యత గురించి ఖచ్చతంగా నేర్పించాలి. అవును.. బాధ్యత ఎంత ముఖ్యమో, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, అది సంబంధాలను నిర్వహించడంలో అయినా లేదా పనిలో అయినా వారికి తప్పక నేర్పించాలి.
ముఖ్యంగా తండ్రి తన కొడుకుకు స్త్రీలను గౌరవించడం నేర్పించాలి. చిన్నప్పటి నుండే స్త్రీలను ద్వేషంతో చూడకూడదని, గౌరవంగా చూడాలని పిల్లలను చెప్పాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీ ప్రాముఖ్యతను నేర్పించాలి. ఏ సంబంధంలోనైనా లేదా జీవితంలోనైనా స్నేహం, ప్రేమ, నిజాయితీని నేర్పించాలి. తండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ, ఆర్థిక నిర్వహణ, జీవితాన్ని ఎలా గడపాలి, సమాజంలో ఎలా జీవించాలి అనే దాని గురించి కూడా నేర్పించాలి.