
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో అట్టహాసంగా జరుగుతుంది. అంతర్జాతీయంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక సినీతారలు విభిన్నమైన దుస్తులు ధరించి తమ స్పై్ల్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది మెట్ గాలా వేడుకలో పలువురు భారతీయ తారలు సైతం సందడి చేశారు. ముఖ్యంగా హీరోయిన్ కియారా అద్వానీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హిందీ సినిమాలో అగ్ర హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత కొన్నాళ్లు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు.. ఇటీవలే మరోసారి రామ్ చరణ్ జోడిగా అలరించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రెగ్నేన్సీ అనౌన్స్ చేసింది కియారా. అలాగే గేమ్ ఛేంజర్ ఈవెంట్లలోనూ అంతగా కనిపించలేదు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న కియారా తాజాగా మెట్ గాలా వేడుకలో పాల్గొన్నారు.
ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన గౌనులో ఆమె మెట్ గాలా వేడుకలో రెడ్ కార్పెట్ పై నడిచారు. ఈ సందర్భంగా కియారా బేబీ బంప్ తో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత మొదటి సారి బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..