హన్సిక 2001లో బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. “షకలక బూమ్ బూమ్”, “హమ్ దో హై” వంటి టీవీ సీరియల్స్‌లో, అలాగే “హవా” (2003), “కోయ్ మిల్ గయా” (2003), “అబ్రక దబ్రా” (2004) వంటి హిందీ సినిమాల్లో నటించింది.
2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఈ ముద్దుగుమ్మకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.
తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కంత్రీ, మస్కా, బిల్లా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సమ్‌థింగ్ సమ్‌థింగ్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా రోజులుగా ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది.
పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ భామ. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో హన్సిక షేర్ చేసే ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్ళైన కూడా ఈ ముద్దుగుమ్మ వయ్యారం ఎక్కడా తగ్గడం లేదు.. తన గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.