
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా బిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే..సాయంత్రం అవ్వగానే చిరుజల్లులతో వాతావరణం చల్లగా మారిపోతుంది. ఓవైపు ఎండల వేడి ఉక్కపోతలలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే..మరోవైపు వడగండ్లతో కూడి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే సోమవారం నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా..మెదక్ లో 40.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు, ఖమ్మంలో 40 డిగ్రీలు, నల్లగొండలో 39 డిగ్రీలు, హనుమకొండలో 35.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35.2 డిగ్రీలు, భద్రాచలంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మంగళవారం నిజామాబాద్‌లో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, భద్రాచలంలో 37.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ వాఖ వెల్లడించింది.
అయితే హైదరాబాద్ సహా కొన్న జిల్లాల్లో సోమవారం వాతావరణం ఉన్నట్టుండి ఒక్కపారిగా మారిపోయింది. ఉదయం నుంచి మూడు పగిలే రీలితో ఎండలు దంచి కొట్టగా ..సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.అయితే మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
మంగళవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాగల మూడు రోజులల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..