
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో అనేక రకాలైన కంటెంట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. థ్రిల్లర్, సస్పెన్స్, రియల్ స్టోరీస్, రొమాంటిక్, హారర్ కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన డిసెంబర్ 2, 1984న సంభవించిన భోపాల్ గ్యాస్ విపత్తు కథ. అదే ది రైల్వే మెన్. ఈ సిరీస్ కొన్ని గంటల్లోనే ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఆరోజు జరిగిన విషాద ఘటన ఆధారంగా రూపొందించారు. అలాగే ఆ ఘటన వెనుక ఉన్న కఠినమైన వాస్తవికతను చూపిస్తుంది. ఇది వ్యవస్థ వైఫల్యం, కానీ కొంతమంది కష్ట సమయాల్లో ‘హీరోలు’ అయ్యారు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రాణాలను కాపాడారు. ఇందులో ఆర్. మాధవన్, కెకె మీనన్, సన్నీ హిందూజా, దివ్వేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇందులో బాబిల్ నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఒకప్పటి హీరోయిన్ జూహి చావ్లా కూడా ఇందులో ఒక ముఖ్యమైన అతిధి పాత్రలో నటించింది. ప్రమాదం జరిగిన రాత్రి రైల్వే స్టేషన్‌లో సరిగ్గా ఏమి జరిగింది ?, ప్రజలను ఎలా రక్షించారు ?, ఏ రైల్వే ఉద్యోగులు లేదా పౌరులు ముందుకు వచ్చారు ? ఇవన్నీ చాలా వాస్తవికంగా, భావోద్వేగంగా చూపించారు.
ఈ సిరీస్ కు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. ఇక ఈ సిరీస్ కథ చెప్పే విధానం ఆద్యంతం ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. కేవలం నాలుగు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..