
దిన ఫలాలు (మే 6, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిగా పనిభారం పెరగడం తప్ప పెద్దగా సమస్యలు, ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలతలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అన్ని విధాలు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ది పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలతో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చదువులు, ఉద్యోగాలకు సంబంధించి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. అందుకుంటారు. చేపట్టిన పనులు తేలికగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లలు బాగా పురోగతి చెందుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభు త్వం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో అధికారాలు పంచుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి, ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశముంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కష్టార్జితంలో ఎక్కువ భాగం మిత్రుల మీదా, విలాసాల మీదా ఖర్చవుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యో గంలో జీత భత్యాలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులతో కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు పరవాలేదన్నట్టుగా సాగుతాయి. రాబడికి లోటుండకపోయినా, పోటీదార్లతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కానీ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. రావలసిన డబ్బు చేతికి అందే అవకాశం ఉండదు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉందది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనారోగ్యం నుంచి కూడా చాలా వరకు బయటపడతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండకపోవచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అధి కారులతో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలకు శ్రమ తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కొందరు మిత్రుల కారణంగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో కూడా అలవికాని లక్ష్యాలతో అవస్థలు పడతారు. వ్యాపారాలు నిదానంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పరిచయాలు కలుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలుంటాయి. మాట తొందరపాటు వల్ల కొందరు మిత్రులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సృంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఒకటి రెండు పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. కొన్ని అత్యవసర కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు.