
విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కేసుపై సీరియస్ అయినట్లు సమాచారం.
బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. దీంతో.. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా త్వరగా శిక్షపడేలా చూస్తామని సీపీ అన్నారు. కాగా నవీన్ కత్తితో దాడి చేయడంతో స్పాట్‌లోనే చనిపోయిన యువతి తల్లి లక్ష్మి మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రేమ పేరుతో నవీన్ గతంలో తమ కూతురిపై దాడి చేశాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అప్పట్లో నవీన్ భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పెద్దల సమక్షంలో పంచాయతీతో ఆగిపోయామని అన్నారు. కానీ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన నవీన్‌కు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు యువతి తండ్రి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి