
ఉదయం టిఫిన్ తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయకూడదు అని చాలా మంది కోరుకుంటారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తింటారు. అలాంటి టిఫిన్స్ లో పెసరట్టు ఒకటి. పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో చేసుకునే ఆహార పదార్దాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికీ చక్కటి టిఫిన్ పెసరట్టు . దీనిని తింటే తొందరగా కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. ఎక్కువ సమయం ఆకలి వెయ్యదు. అయితే ఆంద్ర స్పెషల్ పెసరట్టు వేయడం ఒక కళ. పెసరట్లలో ప్లెయిన్ (సాదా) పెసరట్టు, ఉప్మా పెసరట్టు, ఉల్లి పెసరట్టు, అల్లం పెసరట్టు, క్యారెట్ పెసరట్టు ఇలా ఎన్నో రకాలున్నాయి. దీనిని అందరూ సరిగ్గా చేసుకోలేరు. ఈ రోజు ఈ కొలతల ప్రకారం పెసరట్టు వేసుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా. ఈ రోజు సులభంగా పెసరట్టు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
ముఖ్యమైనవి
కావాల్సిన పదార్ధాలు
- పెసలు – ఒక కప్పు
- ఉల్లిపాయ – రెండు
- పచ్చి మిర్చి – 8
- అల్లం – తగినంత
- జీలకర్ర – మూడు స్పూన్లు
- మిరియాలు – 6
- ఉప్పు – రుచికి సరిపడా
- పసుపు – చిటికెడు
- నెయ్యి –
తయారీ విధానం: పెసలను సుమారు 6గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నె తీసుకుని పెసలు వేసుకుని.. అందులో చిన్న ఉల్లిపాయ ముక్క, రెండు స్పూన్ల జీలకర్ర, మిరియాలు, 5 పచ్చి మిర్చి , ముక్కలుగా కట్ చేసిన అల్లం వేసుకుని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెసర పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంతలో స్టవ్ మీద పెనం పెట్టి.. వేడి ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి పెసర పిండిని దోస మాదిరిగా వేసి.. దానిపై చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అంతే ఆంధ్రాస్పెషల్ పెసరట్టు రెడీ.. దీనిని ఉప్మా కాంబినేషన్ లో అల్లం చట్నీతో తింటే టెస్ట్ కిర్రాక్ అంతే అని అంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..