ఫస్ట్ టైమ్ పవన్ కాస్ట్యూమ్ డ్రామాలో నటిస్తుండటంతో హరి హర వీరమల్లు సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ కావటంతో కీలక పాత్రలకు బాలీవుడ్ స్టార్స్‌ను సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు.
కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమాకు మొదట్లోనే బ్రేక్ పడింది. ఆ తరువాత పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండటం, త్వరగా ఫినిష్ అయ్యే సినిమాలకు ముందు డేట్స్ ఇచ్చేయటంతో ఈ మూవీ డిలే అవుతూ వచ్చింది.
ఎట్టి పరిస్థిత్తులో మార్చిలో సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ ప్రయత్నించినా… సాధ్యం కాలేదు. ఫైనల్‌గా మే 9న రిలీజ్ చేస్తామంటూ కొత్త డేట్ ప్రకటించింది యూనిట్. అయితే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చినా… ఆడియన్స్‌లో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ కనిపించలేదు. పవన్ డేట్స్ ఇవ్వాలి, షూటింగ్ జరిగి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క పూర్తయ్యి అప్పుడు సినిమా ఆడియన్స్ ముందుకు రావాలి. ఇదంతా ఇంత షార్ట్ టైమ్‌లో అయ్యే పనేనా అనుకున్నారు.
లేటెస్ట్ అప్డేట్తో అన్ని అనుమానాలకు చెక్ పెట్టారు మేకర్స్. ఏప్రిల్ 7 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. వారం రోజులు జరిగే ఈ షెడ్యూల్లో నాలుగు రోజులు పాటు పవన్ షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. దీంతో షూటింగ్ అంతా పూర్తవుతుంది.
ప్రజెంట్ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇరాన్, కెనడాతో పాటు ఇండియాలో కూడా చాలా చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఎనౌన్స్ చేసినట్టుగా హరి హర వీరమల్లు మే 9న ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అంటున్నారు మేకర్స్.