Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు సమయం అనుకూలం..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 8, 2025): మేష రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, దాంతో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, దాంతో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. ఇంటా వ్యాపా రాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితముంటుంది. బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవ హారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన విధంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి జీవితంలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో సహోద్యోగుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. కుటుంబ సంబంధమైన బాధ్యతలు కొద్దిగా ఒత్తిడి పెంచుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన లాభం కలుగుతుంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారులకు పెట్టుబడులకు తగ్గ లాభాలు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్టాకుల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు. ఆస్తి వ్యవహారాల్లో లాభాలు పొందు తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మీ సలహాలు, సూచనలకు విలువ నిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమా జంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవ కాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టే పెట్టుబడులు కొద్దిపాటి లాభాలనిస్తాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు శక్తికి మించి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది శ్రమతో పరిష్కారం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ రాబడి అందుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కూడా కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. బంధుమిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ‍యోగం పడుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. రాబడికి లోటుండకపోవచ్చు. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో కొద్దిగా వ్యయ ప్రయాసలు ఉండే అవకాశముంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల మీద ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య మైన పనులు సజావుగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.