
పసిడి ప్రియులకు అదిరి పోయే శుభవార్త. భారత బులియన్ మార్కెట్‌లో గత ఐదారు రోజులుగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. ఇది వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు క్రమంగా నేల చూపులు చూస్తున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 8న) ధరలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర రూ.90,370 వద్ద ఉంది అయితే బంగారం ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
అంతర్జాతీయంగా వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ప్రపంచవ్యాప్త డిమాండ్, కరెన్సీ మార్పిడి రేట్లు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ సంఘటనలు వంటి అంశాలు వాటి విలువను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,520 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద ఉంది.
- బెంగళూరులో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి ధర 93,900 రూపాయలు ఉంది.
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలు హాల్ మార్కులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24 మించకూడదు. అలాగే క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి