Thala is Back: పాత సారథికి మళ్లీ కొత్త పగ్గాలు..కేకేఆర్‌తో జరిగే పోరులో చెన్నై నిలబడుతుందా? తడబడుతుందా?

IPL 2025: ఐపీఎల్‌ సీజన్‌ 18 చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అస్సలు కలిసిరాలేదనే చెప్పాలి. ఈ సీజన్‌లో చెన్నై ఐదు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగతా నాలుగు మ్యాచుల్లో ఘోర పరాభావం ఎదుర్కొంది. ఐదు సార్లు టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో మాత్రం టేబుల్‌ చివరికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.

ఇక ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లు అన్ని రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో జరిగాయి. అయితే గత మ్యాచ్‌లో మోచేతి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక గాయం తగ్గే వరకు అతను వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఇక సీఎస్‌కే పగ్గాలు మళ్లీ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చేతికి వచ్చాయి. దీంతో సీఎస్‌కే అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ధోని వచ్చాడుగా ఇక సీఎస్‌కే విజయాలకు బాటలు పడినట్టే అనే భావనకు వచ్చారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం మరోరా ఉంది. కొత్త సారథి ధోని ముందు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి వాటన్నింటిన ఎదుర్కొని ముందుకు నడవాల్సి ఉంది.

ఇక ఈ సీజ‌న్ మొదటి నుంచే చెన్నై ఆటగాళ్లు అంతంత‌మాత్రంగానే ఆడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అంతగా రాణించలేకపోతున్నారు. 180 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి నానా అవస్థలు పడుతున్నారు. పవర్‌ ప్లే లోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడుతున్నారు. ఇటు మిడిలార్డ‌ర్ విఫలం కావ‌డం, వేగంగా ప‌రుగులు సాధించ‌లేక పోవ‌డం, అటు బౌల‌ర్ల వైఫ‌ల్యం చెన్నైకు పెను శాపంగా మారింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రుత్‌రాజ్‌ మినహా ఎవరూ అంతగా రాణించట్లేదు. ఇప్పుడు అతను కూడా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో చెన్నై పరిస్థితి మరింత దీనంగా మారిందనే చెప్పవచ్చు. దీంతో చెన్నై బ్యాటింగ్‌ లైనప్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రుత్‌రాజ్‌ స్థానాన్ని ఎవరు బర్తీ చేస్తారనే సందేహంలో ఫ్యాన్స్‌ పడిపోయారు. ఇక బ్యాటింగ్‌ లైనప్‌ మార్పులతో పాటు బౌలింగ్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ఇక మ్యాచ్‌ పగ్గాలు ధోనికి వచ్చాయి కాబట్టి మ్యాచ్‌ విజయవాలపై అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇలాంటి పరిస్థితులు కెప్టెన్‌ కూల్‌కు పెద్ద విషమమే కాదని..ఇకపై ఆడే మ్యాచుల్లో ఖచ్చితంగా సీఎస్‌కే నెగ్గుతుందని భావిస్తున్నారు.

ఇక ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ చెపాక్‌ వేదికగా డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్‌ ను చెన్నై సూపర్ కింగ్స్‌ ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేకు ఎంస్‌ ధోని సారథిగా వ్యవహరించనున్నారు. వరుస ఓటములతో డీలా పడిపోయిన సీఎస్‌కేను కెప్టెన్‌ కూల్ ఎలా ముందుకు తీసుకెళ్తారు..కేకేఆర్‌తో జరిగే పోరులో నిలబడతారా..లేదా తడబడతారా అనేది చూడాల్సి ఉంది.

అయితే ఈ సీజ‌న్‌లో కేకేఆర్‌ ఐదు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో ఐపీఎల్‌ టేబుల్‌లో ఆరో స్థానంలో ఉండగా.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన చెన్నై.. నాలిగింటిలో ఓడిపోయి, ఒక్క‌ మ్యాచ్‌లో గెలిచి టేబుల్‌లో తొమ్మిదవ స్థానంలో ఉంది. అయితే ఇకపై జరగబోయే తొమ్మిది మ్యాచుల్లో క‌నీసం ఏడు మ్యాచుల్లో గిలిస్తేనే చెన్నైప్లే ఆప్స్‌కు చేరే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.