
మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి తగిన పనితీరు చేయకపోతే.. శరీరంలోని విషపదార్థాలు చేరి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
బ్లూబెర్రీలు
ఈ చిన్న నీలి పండ్లు శరీరంలోని సెల్ డ్యామేజ్ తగ్గించడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కిడ్నీలపై వచ్చే ఒత్తిడిని తగ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కిడ్నీల్లో వాపు తగ్గించడంలో సహాయపడతాయి.
క్యాబేజీ
క్యాబేజీలో విటమిన్ C, ఫైబర్, ఇతర శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలున్నవారు దీనిని ఆహారంలో చేర్చవచ్చు. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో దోహదపడుతుంది.
ఎగ్ వైట్
ఎగ్ వైట్ లో మంచి మోతాదులో ప్రోటీన్ లభిస్తుంది. అయితే ఇది ఫాస్ఫరస్ తక్కువగా కలిగి ఉంటుంది.. కాబట్టి కిడ్నీ వ్యాధిగలవారు కూడా దీన్ని నిశ్చింతగా తీసుకోవచ్చు. ఇది కండరాలు క్రమంగా క్షీణించే ప్రక్రియను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాపిల్
యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే యాపిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీ సమస్యలను దూరం చేసే శక్తి కలిగి ఉంటాయి.
కొవ్వు చేపలు
సాల్మాన్, ట్యూనా, మాకరెల్ వంటి చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.
రెడ్ గ్రేప్స్
ఎరుపు ద్రాక్షల్లో ఉండే రెస్వెరాట్రోల్ అనే పదార్థం కిడ్నీ కణాలను హాని నుంచి కాపాడుతుంది. ఇది రక్తంలో నెమ్మదిగా సర్క్యులేషన్ జరిగేలా చేస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో సల్ఫర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె పనితీరును మెరుగుపరచి కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
కాలీఫ్లవర్
ఈ కూరగాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా ఉంటుంది. కాలీఫ్లవర్‌లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కిడ్నీలను హాని నుండి కాపాడుతాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన ఆవశేషాలను వేగంగా తొలగించడంలో సహాయపడుతుంది.
ఆకుకూరలు
పాలకూర, తోటకూర, కాలే వంటి ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి, రక్తహీనతను తగ్గిస్తాయి. అంతేకాదు కిడ్నీల పనితీరును సహజంగా మెరుగుపరుస్తాయి.
మనం ప్రతిరోజూ ఫాలో అయ్యే ఫుడ్ డైట్ లో వీటిని చేర్చితే.. కిడ్నీల ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు. మితంగా, సమతుల్యంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీలపై వచ్చే ఒత్తిడిని తగ్గించి.. అవి ఎక్కువకాలం ఆరోగ్యంగా పనిచేసేలా చేయవచ్చు.