వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి.. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్లో శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ అనేది సర్వసాధారణం. ఈ సమయంలో ఎవరికైనా వేడిగా అనిపించినప్పుడల్లా.. ప్రతి ఒక్కరి మనసులోకి వచ్చే మొదటి ఆలోచన చల్లని పానీయం తాగడమే. వేసవిలో కూల్ డ్రింక్స్ వంటివి తాగడం వల్ల శరీరం కొంత సేపు చల్లగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరం.
అందువల్ల వేసవిలో శీతల పానీయాలకు బదులుగా మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను తాగాలి. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పానీయాలను తాగడం వలన శరీరం చల్లగా, హైడ్రేటెడ్ గా మారడమే కాదు.. తక్షణ శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ రోజు వేసవి కాలంలో సులభంగా తయారు చేసుకోగలిగే.. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడే కొన్ని ఉత్తమ పానీయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
నిమ్మకాయ నీరు: వేసవి కాలంలో నిమ్మ రసం తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా నిమ్మరసం సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లు: వేసవి కాలంలో రోజూ కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా.. చల్లగా ఉంచుతాయి. అంతే కాదు కొబ్బరి నీరు చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మామిడి పన్నా: వేసవి కాలంలో చాలా మంది మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. మీరు పచ్చి మామిడికాయ పన్నా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీపిగా, పుల్లగా, రుచిగా ఉంటుంది. అంతే కాదు
మామిడి పన్నా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మజ్జిగ: వేసవిలో అజీర్ణం, ఆమ్లత్వం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు రావడం సర్వసాధారణం. మీకు జీర్ణ సమస్యలు కూడా ఉంటే తినే ఆహారంలో మజ్జిగను చేర్చుకోవచ్చు. ఇది ప్రోబయోటిక్, కనుక ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కూడా పనిచేస్తుంది.
వెలగ పండు జ్యూస్: వేసవి కాలంలో వెలగ పండు (చెక్క ఆపిల్) రసం ఒక వరం లాంటిది. వేసవి కాలంలో తినే ఆహారంలోవెలగ పండు రసాన్ని చేర్చుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.