
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈసినిమాలో న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో నాని రఫ్పాడించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు నాని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని హిట్ 3 సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి ఓ హీరోయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన హీరోయిన్ మరెవరో కాదు.. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు నాని. మే 1న ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయిల కనిపించిన నాని.. ఇప్పుడు హిట్ 3 సినిమాలో ఊహించని విధంగా కనిపించనున్నారట. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న ఈ మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. శ్రీనిధి శెట్టి గురించి కొత్తగా పరిచయం అవసరంలేదు. కేజీఎఫ్ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకుంది శ్రీనిధి.ఈ సినిమా తర్వాత శ్రీనిధికి వరుస ఆఫర్స్ క్యూ కట్టినప్పటికీ రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం హిట్ 3 సినిమాతోపాటు తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..