
నిద్రలో కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ కలలలో రకరకాల వస్తువులు , విషయాలను చూస్తారు. ఎందుకంటే కలలు కనడం అసాధారణం కాదు. ఉపచేతన మనస్సులో దాగిఉన్న అనేక భయాలు, సంఘర్షణలు కలలు కనేవారిపై వైవిధ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కలలలో అనేక వస్తువులు, పక్షులుం, జంతువులు, ప్రదేశాలతో పాటు.. హిందూ దేవుళ్ళు కూడా కనిపిస్తాయి. ఇలా దేవుళ్ళు కలల్లో చూడటం వేరే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కలలలో దేవుళ్ళు, దేవతలను చూడటం గురించి వేర్వేరు వివరణలు ఉన్నాయి. అవి కొన్నిసార్లు శుభప్రదమైనవి. కొన్నిసార్లు అశుభకరమైనవి.
స్వప్న శాస్త్రం ప్రకారం దేవుళ్ళు, దేవతలలో శ్రీ రాముడు కలలో కనిపించడం వెనుక కొన్ని అర్ధాలున్నాయి. రాముడు కలలో కనిపిస్తే జీవితంలో కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇస్తున్నట్లు అర్ధం అట. మీ కలలో శ్రీరాముడు కనిపిస్తే అది మీకు శుభసూచకం కావచ్చు. రామచంద్రుడు మాత్రమే కాదు, హనుమంతుడు మీ కలలో కనిపించినప్పుడు ఏమి జరుగుతుందో? ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..
శ్రీరామచంద్రుడిని కలలో కనిపిస్తే ఆర్ధం ఏమిటంటే
స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో శ్రీ రామ చంద్రుడిని చూసినట్లయితే.. అది శుభప్రదమైన కల కావచ్చు. కలలలో దేవుళ్ళు, దేవతలను చూడటం జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తుంది. శ్రీ రాముడిని కలలో కనిపించడం వెనుక ఉన్న అర్ధం.. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయని సంకేతమట.
కలలో రామాలయం కనిపిస్తే
ఒక వ్యక్తి కలలో రామాలయాన్ని చూసినట్లయితే.. ఆ కల కూడా చాలా శుభప్రదమట. ఇలాంటి కల వస్తే దానికి అర్ధం.. మీ మిగిలిన పనులన్నీ త్వరలో పూర్తవుతాయి. మీ లక్ష్యాలు త్వరలో నెరవేరవేరే అవకాశం ఉంది.
కలలో రామచంద్రుడు, హనుమంతుడు కనిపిస్తే
ఏ రామ భక్తుడికైనా కలలో శ్రీరాముడు , హనుమంతుడు కలిసి కనిపిస్తే.. ఆ కల ఆ వ్యక్తికి చాలా శుభప్రదంగా మారుతుంది. ఈ కల ఆ వ్యక్తి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుందని అర్ధం. శ్రీరాముడు, హనుమంతుని కలిసి చూడటం జీవితంలోని అన్ని సమస్య;లు తొలగిపోనున్నాయని సంకేతమట.
కలలో హనుమంతుడిని చూసినట్లయితే
ఎవరి కలలో బజరంగబలిని చూసినట్లయితే లేదా మీ కలలో హనుమంతుడి ఆలయం, అతని విగ్రహం మొదలైనవి చూసినట్లయితే.. ఈ కల చాలా శుభప్రదంగా ఉంటుంది. త్వరలో హనుమంతుని ఆశీస్సులు లభించనున్నాయని అర్ధం. శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఈ కలకు అర్ధం .
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు