ప్రతిరోజూ లక్షలాది మంది వైష్ణో దేవి మాత ఆలయాన్ని సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వస్తారు. చాలా మంది ప్రజలు మాతా రాణి ఆస్థానాన్ని సందర్శించిన తర్వాత మర్నాడే తిరిగి సొంత ఊర్లకు పయణం అవుతారు. అయితే ఎంతో దూరం నుంచి అక్కడికి వెళ్లి.. వెంటనే తిరిగి వచ్చేయకుండా.. సమీపంలోని ఈ ప్రదేశాలను సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కూడా వైష్ణో దేవికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు సమీపంలోని అనేక అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్రదేశం వైష్ణో దేవి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటువంటి పరిస్థితిలో మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఈ అందమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.
సిహాద్ బాబా: కత్రా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో ఉంది. ఇది సహజ సౌందర్యానికి హిందూ మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. జనసమూహానికి దూరంగా.. అక్కడ ప్రశాంతంగా సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. గతంలో ఇక్కడి జలపాతం కింద ప్రజలు స్నానం చేసేవారు. అయితే కొన్ని విపత్తు తర్వాత.. ఇక్కడ జలపాతం కింద స్నానం చేయడం నిషేధించబడింది.
శివఖోడి: జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో ఉన్న శివఖోడి శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ గుహ ఆలయం. ఇది ఒక ప్రసిద్ది చెందిన మతపరమైన పర్యాటక కేంద్రం. ఇది కత్రా నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్ర గుహ లోపల 4 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. ఈ శివలింగం మీద ఎల్లప్పుడూ పవిత్ర జల ప్రవాహం పడుతూనే ఉంటుంది. మీరు దర్శనం కోసం ఇక్కడికి కూడా వెళ్ళవచ్చు.
మన్సార్: కత్రా నుంచి మాన్సార్ వరకు దూరం దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది మన్సార్. ఇక్కడికి కూడా వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం జమ్మూ నగరం నుంచి దాదాపు 37 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులు, పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది. ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో సందర్శనకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇక్కడ మీరు మన్సార్ సరస్సు, సురిన్సార్ సరస్సు , సురిన్సార్-మన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించవచ్చు. ఇక్కడ ఉమాపతి మహాదేవ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
హిమ కోటి: కత్రా నుంచి హిమకోటికి దూరం దాదాపు 10 కిలోమీటర్లు. ఇది చాలా అందమైన ప్రదేశం. ఈ లోయ సహజ దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కృత్రిమ చెరువు ఇక్కడి ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. జనసమూహానికి దూరంగా అందమైన, ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.