Video: వామ్మో.. ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అంత మాట అనేశారు..

Lucknow Super Giants vs Chennai Super Kings, 30th Match: ఐపీఎల్ 2025 ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లు దాదాపుగా 5 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లపై అందరి చూపు పడింది. ప్రస్తుతం టాప్ 4లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజరస్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు నిలిచాయి. అయితే, ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది అన్ని భాషలలో ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంది. ముఖ్యంగా తెలుగు కామేంటటరీతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్.. తాజాగా ఓ బ్లండర్ మిస్టేక్‌తో నవ్వుల పాలైంది. దీనిపై సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ నడుస్తున్నాయి. పంత్‌ వికెట్‌పై మాట్లాడుతూ ఓ బ్లండర్ మిస్టేక్ చెప్పండంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లక్నోలో జరిగిన 30వ మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ధోని తన పాత ఫాంతో చెలరేగిపోయాడే. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌తో మ్యాచ్‌ను మార్చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (63) ఫాంలోకి వచ్చాడు. లక్నోను భారీ స్కోర్‌గా తీసుకెళ్లే క్రమంలో భారీ షాట్లు ఆడుతూ పంత్ వికెట్ కోల్పోయాడు. పతిరణా బౌలింగ్‌లో పంత్ భారీ షాట్ ఆడబోయి ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో తెలుగులో కామెంట్రీ చేస్తోన్న వ్యక్తి రిషబ్ పంత్‌ను రిషబ్ పంది అంటూ సంబోధించాడు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ లాంటి రిచ్ లీగ్‌ను టెలికాస్ట్ చేస్తూ, ఇలాంటి చెత్త మాటలు చెప్పడం ఎంత వరకు సమంజసం అంటూ ఏకిపారేస్తున్నారు. మీరు కూడా ఆ క్లిప్‌ను చూసేయండి..

 

View this post on Instagram

 

A post shared by memes creater (@thaggedelemems)

మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే?

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ను ఓడించి విజయాల ట్రాక్‌లోకి తిరిగి వచ్చింది. ఏడు మ్యాచ్‌ల్లో చెన్నైకు ఇది రెండో విజయం. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో లక్నో మూడో ఓటమిని చవిచూసింది. సోమవారం ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో, కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, చెన్నై 19.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఎంఎస్ ధోని, శివం దూబేల అజేయ అర్ధ సెంచరీ భాగస్వామ్యం కారణంగా మ్యాచ్ గెలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.