Varudhuni Ekadashi: సహస్ర గోదాన ఫలితం ఇచ్చే వరూధుని ఏకాదశి పూజ? దానాలు ఏమిటంటే..

వరూధిని ఏకాదశి అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పర్వదినం. దీనిని చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిధిన జరుపుకుంటారు. వరూధిని ఏకాదశి ఉపవాసం శ్రీ మహా విష్ణువు వరాహ అవతారానికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా ఒక వ్యక్తి తన పాపాల నుంచి విముక్తి పొంది పుణ్యం పొందుతాడని నమ్ముతారు. ఈ ఉపవాసం అదృష్టం, సంపద, శ్రేయస్సు, కీర్తిని ప్రసాదిస్తుందని భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేయడం వలన మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. ఈ ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

పంచాంగం ప్రకారం చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి 23 ఏప్రిల్ 2025న సాయంత్రం 04:43 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే 24 ఏప్రిల్ 2025న మధ్యాహ్నం 02:32 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఏప్రిల్ 24వ తేదీ గురువారం వరూధిని ఏకాదశి వ్రతం పాటించబడుతుంది. ఈ ఏకాదశి ఉపవాసం మర్నాడు ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం ఉదయం 05:46 నుంచి 08:23 వరకు విరమించాల్సి ఉంటుంది.

వరూధిని ఏకాదశి రోజున ఉపవాసం చేసే విధానం

  1. దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి, రాత్రి బ్రహ్మచర్యం పాటించండి.
  2. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి.
  3. విష్ణువును పూజించండి. పండ్లు, పువ్వులు, ధూపం, దీపాలు మొదలైనవి సమర్పించండి.
  4. రోజంతా ఉపవాసం ఉండండి లేదా పండ్లు మాత్రమే తినండి. తృణధాన్యాలు తినడం నిషేధించబడింది.
  5. రాత్రిపూట మేల్కొని విష్ణువును స్తుతిస్తూ కీర్తనలు పాడండి.
  6. ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత, బ్రాహ్మణులకు ఆహారం అందించి దానధర్మాలు చేయండి.
  7. దీని తరువాత ఉపవాసం విరమించి, పేదలకు దానం చేయండి.

వరూధిని ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి

  1. శ్రీ విష్ణువు ఆరాధనలో శంఖాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదమైనది. ఫలవంతమైనదని నమ్ముతారు. వరూధిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువు విగ్రహాన్ని శంఖంలో నీరు పోసి స్నానం చేసి, పూజించిన తర్వాత శంఖాన్ని ఊదితే.. శ్రీ హరి త్వరలోనే సంతోషించి భక్తుడికి కావలసిన వరం ఇస్తాడు.
  2. వరూధిని ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు పూజలో ఉపయోగించే శంఖాన్ని గంగాజలంతో నింపి ఇంటి అంతటా చల్లితే, ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి, సానుకూల శక్తితో పాటు ఆనందం, అదృష్టం వెల్లివిరుస్తాయి.
  3. వరూధిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువును త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి, విష్ణువు నుంచి కోరుకున్న వరం పొందడానికి.. విష్ణు పూజలో సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను సమర్పించండి. దీనిని హిందూ మతంలో విష్ణుప్రియ అని పిలుస్తారు.
  4. శ్రీ విష్ణువు పూజలో పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం చాలా శుభప్రదమని హిందూ విశ్వాసం. అటువంటి పరిస్థితిలో వరూధిని ఏకాదశి రోజున విష్ణువు పూజలో పసుపు రంగు బట్టలు, పసుపు పువ్వులు, పసుపు గంధం, పసుపు పండ్లు . పసుపు తీపి పదార్థాలను సమర్పించడమే కాదు.. మీరు కూడా పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి.
  5. వరూధిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువు అనుగ్రహం పొందడానికి ఆవు నెయ్యి దీపం వెలిగించి పూజ , హారతి ఇవ్వండి. ఏకాదశి పూజ సమయంలో ఈ పరిహారాన్ని చేయడం వలన శ్రీ హరి ఆశీస్సులు త్వరగా లభిస్తాయని నమ్ముతారు.
  6. ఈ రోజున చేసే పూజ దానాలు సహస్ర గోదాన ఫలం లభిస్తుందని విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.