ఏజ్ 42.. కానీ క్రేజ్ మాత్రం ఇన్ఫినిటీ.. త్రిషకు మాత్రమే అప్లై అయ్యే ఫార్ములా ఇది. 23 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఈమె చేతిలో అరడజన్కు పైగానే సినిమాలున్నాయి.
ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఐడెంటిటీ సినిమాలతో వచ్చారు. త్వరలోనే విశ్వంభరతో రానున్నారు.. ఇందులో అవని పాత్రలో నటిస్తున్నారు త్రిష కృష్ణణ్. స్టాలిన్ తర్వాత చిరుతో త్రిష నటిస్తున్న సినిమా ఇది.
ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. ఇంకోవైపు స్టార్ హీరోల సినిమాల్లో వరస అవకాశాలతో తగ్గేదే లే అంటున్నారు త్రిష. ముఖ్యంగా సీనియర్లకు త్రిష తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదు. తెలుగులో చిరంజీవి.. తమిళంలో అజిత్, సూర్య, కమల్ లాంటి హీరోలు మళ్లీ మళ్లీ త్రిషతోనే నటిస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్.
2025, మే 4తో 42 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు త్రిష. ఈ వయసులోనూ ఈమెకు హీరోయిన్గా వరస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు.. ఫిజిక్ మెయింటేన్ చేయడంలోనూ త్రిష నెక్ట్స్ లెవల్.
పాతికేళ్లుగా ఒకేలా కనిపిస్తూ టొవినో థామస్ లాంటి ఈ జనరేషన్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వంభర, థగ్ లైఫ్, మోహన్ లాల్ రామ్, సూర్య 45 సినిమాలతో బిజీగా ఉన్నారు త్రిష.