
అందం అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు. సినిమా అవకాశాలు అందుకుంటున్నా కూడా సరైన హిట్స్ లేక స్టార్ డమ్ తెచ్చుకోలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. అలాంటి వారిలో ఈ క్రేజీ బ్యూటీ ఒకరు.. అందం అభినయం ఉన్న ఈ గ్లామర్ బ్యూటీ తన వయ్యారంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్ చేసింది. అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది.. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
చేసింది కొన్ని సినిమాలే కానీ ఆ సినిమాల్లో పెద్ద హిట్ అయినా సినిమా ఒకటి కూడా లేదు. కానీ గ్లామర్ లో మాత్రం అప్సరసే.. ఆమె ఎవరో కాదు కేజీ బ్యూటీ డింపుల్ హయాతి. డింపుల్ హయాతి 2017లో ‘గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆతర్వాత 2019లో యురేక సినిమాలో నటించింది. అయినా కూడా గుర్తింపు రాలేదు. అదే సమయంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర ‘ పాటలో నటించింది. ఈ పాటలో హాట్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంది.
ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. చివరిగా రామబాణం అనే సినిమాలో కనిపించింది. కానీ ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి నటిస్తుంది డింపుల్. బోగి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో డింపుల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా పై డింపుల్ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ చిన్నదానికి హిట్ అందుతుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి