
పెళ్లి కూతురుగా ఫుల్లుగా ముస్తాబై ఒక్కసారిగా రోడ్డుమీదికి వస్తే ఎమౌతుంది..? ఒక్కరు కాదు వందల మంది పెళ్లికూతుళ్లు ఒక్కసారిగా రోడ్డుమీద క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మేకప్.. ఆ కాస్ట్యూమ్స్‌తో ఆలాగే వీధుల్లో నడిచొస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు కదూ.. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆభరణాలు ధరించి, పెళ్లికూతురు అలంకరణలో మెరిసిపోతూ చాలా మంది మహిళలు రోడ్డుపై నడవడం ఆ వైరల్ వీడియోలో కనిపిస్తుంది
అయితే ఇది మేకప్ శిక్షణా సంస్థ కోసం ప్రమోషనల్ వీడియోలో భాగం మాత్రమే, కానీ ఆకస్మిక ర్యాంప్ షో స్థానికులనే కాకుండా నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. మేకప్ ఆర్టిస్ట్ మన్వీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వీక్షించారు. స్థానిక మార్కెట్ వీధుల్లో వధువుల గుంపు నడుస్తూ వెళుతుంది. దుకాణదారులు, బాటసారులు స్టూడియోలో నుంచి వస్తున్న వధువుల వాకింగ్‌ను చూసి ఆశ్చర్యపోతారు.
వధువుల వాకింగ్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మహిళల ఆత్మవిశ్వాసం, శక్తిని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. “ప్రతి మేకప్ ఆర్టిస్ట్‌కు ఇదో గర్వకారణమైన క్షణం” అని మరికొందరు నెటిజన్స్ పోస్టులు పెట్టారు.
వీడియో చూడండి :